ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సింప్లిసిటీకి మారుపేరు అనే విషయం తెలిసిందే. పెద్ద స్టార్ అయినా.. డిప్యూటీ సీఎం అయినా ఆయన చాలా ఒదిగి ఉంటారు. ఎక్కడ గర్వం అనే మాటే చూపించరు. తనకు నచ్చిన విధంగా ఉంటారు. ఇప్పుడు ఆయన పిల్లలకు కూడా ఇదే సింప్లిసిటీ వచ్చింది. తాజాగా పవన్ కుమార్తె ఆద్య(AADHYA) ఆటోలో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ఈ వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కాశీలో ఆద్యతో ఆటో రైడ్ అంటూ తెలిపారు.
ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఆద్య సింప్లిసిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రి ఓ పెద్ద స్టార్ హీరో.. అలాగే ఓ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా ఎంత సింపుల్‌గా నడుచుకుంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆద్య నిరాడంబరతను మెచ్చుకుంటున్నారు. అలాగే అకీరా నందన్ కూడా సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడతాడు అంటూ గుర్తు చేసుకుంటున్నారు. ఆద్య, అకీరాలు విలాసాలకు అతీతంగా సాధారణంగా జీవించడాన్ని కొనియాడుతున్నారు.