Pawan Kalyan – Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు ట్రైలర్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ వన్ మెన్ షోగా ఈ ట్రైలర్ నిలిచింది. పవన్ హీరోయిజం, ఎలివేషన్లు, పవర్‌ఫుల్ డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లతో ఈ ట్రైలర్‌ను మేకర్స్ కట్ చేశారు.
వాయిస్ ఓవర్‌తో…
హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం…ఈ దేశ శ్రమ బాద్‌షా పాదాల కింద నలిగిపోతున్న సమయం…ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ గంభీరమైన ఓ వాయిస్‌తో ఈ ట్రైలర్ మొదలైంది.
పవన్ ఎంట్రీ…
ఇది నేను రాసే చరిత్ర…సింహాసనమా…మరణ శాసనమా…అంటూ ఔరంగజేబు అకృత్యాలను చూపిస్తూ ట్రైలర్ సాగింది. భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్…దానిని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి అని తనికెళ్ల భరణి డైలాగ్‌తో పవన్ ట్రైలర్‌లోకి ఎంట్రీ ఇవ్వడం గూస్‌బంప్స్‌ను కలిగిస్తోంది.
వీరమల్లు చెప్పింది వినాలి…
ఇప్పటిదాకా మేకలను వేటాడే పులిని చూసుంటారు…ఇప్పుడు పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు….నేను రావాలని చాలా మంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటారు. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు…వినాలి వీరమల్లు చెప్పింది వినాలి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
పవన్‌కు ధీటుగా…
ట్రైలర్‌లో చారిత్రక యోధుడిగా పవన్ లుక్, మ్యానరిజమ్స్ ట్రైలర్‌లో కొత్తగా ఉన్నాయి. యుద్ధ సన్నివేశాలు, విజువల్స్ గ్రాండియర్‌గా కనిపిస్తున్నాయి. ఔరంగజేబుతో పవన్ కళ్యాణ్‌కు ధీటుగా తన విలనిజంతో ట్రైలర్‌లో బాబీ డియోల్ నటన ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
చారిత్రక యోధుడిగా…
మొఘలుల కాలం నాటి కథతో హరిహరవీరమల్లు మూవీ తెరకెక్కుతోంది. ఇందులో మొఘల్ రాజు ఔరంగజేబు అన్యాయాలు, అక్రమాలను ఎదురించి పోరాడే చారిత్రక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. హిస్టారికల్ కాన్సెప్ట్‌తో పవన్ కళ్యాణ్ చేస్తోన్న ఫస్ట్ మూవీ ఇది కావడం గమనార్హం.
క్రిష్‌తో మొదలై…
హరిహరవీరమల్లు మూవీ క్రిష్ దర్శకత్వంలో మొదలైంది. సినిమా మధ్యలో నుంచి క్రిష్ తప్పుకోవడంతో అతడి స్థానంలో నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు ఏఎమ్ జ్యోతికృష్ణ మిగిలిన సినిమాను పూర్తిచేశారు.
హరిహరవీరమల్లు సినిమాను 2022లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో బిజీగా మారడంతో షూటింగ్ ఆలస్యమైంది. అప్పటి నుంచి పలుమార్లు రిలీజ్ వాయిదాపడుతూ రావడంపై అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు జూలై 24న ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకలు ముందుకు రాబోతుంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో అనసూయ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నది.
HHVM Trailer: పులిని వేటాడే బెబ్బులి – పవన్ కళ్యాణ్ వన్ మెన్ షో – హరిహరవీరమల్లు ట్రైలర్ రిలీజ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES