HHVM: హిస్టారికల్ కథతో కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ చేసిన సినిమా హరిహర వీరమల్లు. క్రిష్, ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మూడేళ్లకు పైగా షూటింగ్‌ను జరుపుకుంది. నిర్మాణంతో పాటు రిలీజ్‌లో ఎన్నో అడ్డంకులను దాటుకొని జూలై 24న (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీడియోల్ విలన్‌గా కనిపించాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఏఎమ్‌రత్నం ఈ సినిమాను నిర్మించారు. హరిహర వీరమల్లు ఎలా ఉంది? రీఎంట్రీలో పవన్ కళ్యాణ్‌కు హిట్ దక్కిందా? లేదా? అంటే?
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు గురువారం (జూలై 24న) రిలీజైంది. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి క్రిష్, ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.
హరిహర వీరమల్లు కథ…
ఢిల్లీ పాలకుడు ఔరంగజేబు (బాబీ డియోల్) హిందువులపై జిజియా పన్ను విధిస్తూ బలవంతపు మతమార్పిడిలకు పాల్పడుతుంటాడు. ఔరంగజేబు అకృత్యాలను భరించలేక ఎంతో మంది హిందువులు ప్రాణత్యాగాలకు సిద్ధపడుతుంటారు. అదే కాలంలో కొల్లూర్ ప్రాంతంలో వీరమల్లు (పవన్ కళ్యాణ్) పెద్దలను దోచుకుంటూ ఆ సంపదను పేదలకు పంచిపెడుతుంటాడు. చోరకళలో, వీరత్వంలో వీరమల్లుకు మించిన వారు ఉండరు.. వీరమల్లు ధైర్యసాహసాలు విన్న స్థానిక రాజు చిన్న దొర( సచిన్ ఖేడ్కర్) గోల్కొండ నవాబుకు తాను కప్పంగా కడుతున్న వజ్రాలను దొంగిలించాలని చెబుతాడు.
చిన్న దోర ఆస్థానంలో ఉన్న నాట్యకారిణి పంచమి ప్రేమలో పడతాడు వీరమల్లు. కానీ ఆమె మోసం వల్ల వజ్రాలను కొట్టేయబోతూ గోల్కొండ నవాబుకు వీరమల్లు బంధీగా చిక్కుతాడు. ఆ తర్వాత ఏమైంది? ఔరంగజేబు వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగతనం చేయాలని వీరమల్లు ఎందుకు నిర్ణయించుకున్నాడు? అసలు వీరమల్లు ఎవరు? మొఘల్ చరిత్రలోనే క్రూరుడిగా పేరుతెచ్చుకున్న ఔరంగజేబు సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా అడుగుపెట్టాడు? హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటం చేశాడు? పంచమి అతడిని ఎందుకు మోసం చేసింది అన్నదే ఈ మూవీ కథ.
ఈజీ కాదు…
చారిత్రక కథలతో సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. అందులో స్టార్ హీరోతో ఈ జానర్‌లో సినిమా అంటే రిస్క్ డబుల్‌గా ఉంటుంది. హరిహర వీరమల్లుతో ఆ సాహసానికి సిద్ధపడ్డారు డైరెక్టర్లు క్రిష్, ఏఎమ్ జ్యోతికృష్ణ. మొఘల్, గోల్కొండ నవాబుల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలకు వీరమల్లు అనే ఫిక్షనల్ క్యారెక్టర్‌ను జోడిస్తూ ఈ కథను రాసుకున్నారు.
Also Read – Rajeev kanakala: భూ వివాదంలో సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసు నోటీసులు..!
జిజియా పన్ను…
ఔరంగజేబు పాలనలో హిందువులు ఎదుర్కొన్న కష్టాలతో పాటు జిజియా పన్ను పేరుతో బలవంతపు మత మార్పిడిలకు మొఘల్ రాజు ఎలా పాల్పడ్డాడు అన్నది సినిమాలో చూపించారు డైరెక్టర్లు. దేశ సంపదకు చిహ్నంగా నిలిచిన కోహినూర్ డైమండ్ కొల్లూరు నుంచి మొఘల్ రాజుల వద్దకు ఎలా చేరిందన్నది చరిత్రను నేటితరానికి అర్థమయ్యేలా చెప్పారు. మొఘల్ రాజు ఔరంగజేబు అక్రమాలను ఎదిరించడంతో పాటు సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం యోధుడైన వీరమల్లు సాగించిన పోరాటాన్ని ఆవిష్కరిస్తూ వీజువల్ ఫీస్ట్‌గా ఈ సినిమా సాగుతుంది.
రాబిన్‌హుడ్ లాంటి కథ…
హరిహర వీరమల్లు రాబిన్‌హుడ్ లాంటి సినిమా. ఇలాంటి కథలను హీరోయిజం, ఎలివేషన్లు, యాక్షన్ అంశాలతో చెప్పినప్పుడే ఆడియెన్స్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. ఇదే రూల్‌ను ఫాలో అయ్యారు మేకర్స్. ఫస్ట్ హాఫ్‌లో పోర్ట్ సీన్ ఫైట్, మల్ల యోధులతో పవన్ తలపడే ఎపిసోడ్, చార్మినార్ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి.
సెకండాఫ్ మైనస్…
పంచమి పాత్రను డైరెక్టర్స్ బాగా రాసుకున్నారు. ఆమె క్యారెక్టర్‌కు సంబంధించి వచ్చే ట్విస్ట్ ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది. లవ్ ట్రాక్ చిన్నదే అయినా ఆకట్టుకుంటుంది. ఔరంగజేబు నుంచి వజ్రం కొట్టేయడానికి వీరమల్లు ఒప్పుకునే సీన్‌తో సెకండాఫ్‌లోకి అడుగుపెట్టారు డైరెక్టర్. కీలకమైన ఈ డ్రామాను ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు తడబడిపోయాడు. కోహినూర్‌ను దొంగిలించడంతో పాటు హిందూ ధర్మ రక్షణ కోసం హీరో సాగించే ప్రయాణాన్ని స్క్రీన్‌పై ఆవిష్కరించడంలో ఆడియెన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ డైరెక్టర్స్ రీచ్ కాలేదు. విజువల్ ఎఫెక్ట్స్, సీజీ వర్క్ పేలవంగా ఉండటం పెద్ద మైనస్‌గా మారింది. చాలా చోట్ల పవన్ కళ్యాణ్ లిప్ సింక్ సరిగ్గా లేదు. సెకండ్ పార్ట్ కోసం వీరమల్లు లక్ష్యాన్ని అసంపూర్తిగా ముగించడం కూడా ఫ్యాన్స్‌ను డిసపాయింట్ చేసింది.
Also Read – Guava leaves: రోజూ పరగడుపున ఈ ఆకు నమిలితే.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఇవే!
పవన్ వన్ మెన్ షో…
పవన్ కళ్యాణ్ వన్‌మెన్ షోగా హరిహర వీరమల్లు నిలిచింది. తన లుక్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టారు. సనాతన ధర్మం గురించి పవన్ చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. పవన్ ఇమేజ్‌తో పాటు ఆయన ఐడియాలజీని అంతర్లీనంగా కథలో చూపించారు దర్శకద్వయం. పవన్ కళ్యాణ్‌పై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. పంచమి పాత్రకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా నిధి అగర్వాల్ నిలిచింది. డిఫరెంట్ వేరియేషన్స్‌తో సాగే పాత్రలో తన నటనతో మెప్పించింది. పాటల్లో గ్లామరస్‌గా కనిపించింది.
ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీడియోల్ నటన బాగుంది. ఇటీవల కన్నుమూసిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. నాజర్, సత్యరాజ్, సుబ్బరాజు, సునీల్‌తో పాటు మిగిలిన యాక్టర్స్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కొల్లగొట్టినాదిరో పాటలో అనసూయ, పూజిత పొన్నాడ ఆకట్టుకున్నారు. పీరియాడికల్ ఫీల్‌ను ఎలివేట్ చేయడంలో కీరవాణి మ్యూజిక్ హెల్పయ్యింది.
రిజల్ట్ మరోలా ఉండేది…
హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను నమ్ముకొని తెరకెక్కించిన మూవీ. మొఘలుల పాలనలోని ప్రపంచానికి తెలియని కోణాలను ఈ సినిమాలో చూపించిన విధానం బాగుంది. గ్రాఫిక్స్, సీజీ వర్క్ బాగుంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.
రేటింగ్ – 3/5

