Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. శ్రీలీల, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మార్చి 19న విడుదలకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతంగా జరుపుకుంటుంది. ముందుగా ప్రకటించిన డేట్ కంటే వారం ముందుగానే మూవీని థియేటర్లలోకి తీసుకువస్తున్నారు.
జీరో కట్స్ సర్టిఫికేట్ జారీ
మూవీ నిర్మాణాంతర కార్యక్రమంలో భాగంగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా బోర్డు మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు మూవీ టీం ప్రకటించింది. ఈ సందర్భంగా మేకర్స్ హీరోహీరోయిన్లకు సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ రన్ టైమ్ విషయానికి వస్తే సుమారు 2 గంటల 34 నిమిషాలుగా నిడివి నిర్ణయించారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ టీజ్ మూవీపై ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా ఈ మూవీలో పవన్ లుక్ ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు పెంచుతోంది. ఉస్తాద్ తో వింటేజ్ పవన్ ని హరీష్ శంకర్ మరోసారి అభిమానుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.
దీంతో ఉస్తాద్ కోసం ఫ్యాన్స్ అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి అందరి అంచనాలను మంచి ఉస్తాద్ ఆకట్టుకుంటాడా? లేదా అనేది అందరిలో ఉన్న ప్రశ్న. ఇదిలా ఉంటే.. మరికొన్ని రోజుల్లో ట్రైలర్ రాబోతోంది. మరి అది ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. మూవీ టీం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ కార్యక్రమం ఏపీలోనా, తెలంగాణలో అనేది క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే దీనిపై కూడా స్పష్టత రానుంది. ఓజీ మించిన హిట్ కొట్టేందుకు మూవీ టీం గట్టిగానే ప్లాన్ చేస్తుంది.
Also Read: Demon Pavan: బిగ్ బాస్ డిమోన్ పవన్ ఇంట విషాదం.. తండ్రి మృతి
మార్చి 19న రిలీజ్
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఇద్దరు సంగీతం అందించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ విడుదల కానుంది. కాగా, మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి 26న ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది.కానీ,‘టాక్సిక్’ వాయిదా పడటంతో వారం ముందుకు జరిగింది. వరుస సెలవుల నేపథ్యంలో ‘ఉస్తాద్’ ముందుకు రావడం మంచి నిర్ణయమే అయినా, ‘ధురంధర్2’ నుంచి మాత్రం బాక్సాఫీస్ పోటీ గట్టిగా ఉండేలా ఉంది. మరి దాన్ని తట్టుకుని ఉస్తాద్ నిలబడతాడా? లేదా? అని రిలీజ్ తర్వాత తెలుస్తోంది.

