Ustad Bhagat Singh Trailer: ఫ్యాన్స్ అంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్‌ల ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మార్చి 19న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్, పాటలు, టీజర్ మూవీ మంచి బజ్ క్రియేట్ చేశాయి.
గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్
ఈ క్రమంలో రోజురోజుకి ట్రైలర్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక మూవీ రిలీజ్ డేట్ కూడా వారం ముందుగా జరగడంతో మూవీ బజ్‌కి ట్రైలర్ మరింత కీలకంగా మారింది. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో హరీష్ శంకర్ మార్క్, పవన్ మ్యానరిజం ఫుల్‌గా కనిపించాయి. పవర్ ప్యాక్డ్‌గా సాగిన ట్రైలర్ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో వింటేజ్ పవన్ కనిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేం గబ్బర్ సింగ్ మూవీని గుర్తు చేస్తుంది.
అంచనాలను మించిన ట్రైలర్
అదే పవన్, అదే క్రేజ్, మ్యానరిజంతో గబ్బర్ సింగ్ మ్యాజిక్‌ని రిపీట్ చేశాడనిపిస్తోంది. గతంలో పవన్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కూడా దాని మించి హిట్ అవుతుందని ఫ్యాన్స్ అంత గట్టి నమ్మకంతో ఉన్నారు. తాజాగా విడుదల ట్రైలర్ వారి ఆశలకు మరింత బలం ఇచ్చేలా ఉంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ పవర్ ప్యాక్డ్‌గా ట్రైలర్ కట్ చేసి వదిలాడు దర్శకుడు హరీష్ శంకర్. ప్రస్తుతం ఈ ట్రైలర్ తో మూవీపై అంచనాలను మరింత పెంచేస్తోంది. మరి మార్చి 19న వస్తున్న ఉస్తాద్ బాక్సాఫీసు వద్ద ఎలాంటి సంచలనంసృష్టిస్తాడో చూడాలి.
Also Read: Anushka Shetty: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క!

