Anna Lezhneva: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అన్నా కొణిదెల పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా తొలి పోస్టు తన భర్త పవన్‌తో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ.. చిరంజీవి ఆశీస్సులు.. పవన్ కళ్యాణ్ సపోర్టుతో సోషల్ మీడియాలోకి వచ్చానని తెలిపారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్ భార్యకు ఘనస్వాగతం పలికారు. అంతేకాదు ఈ వేదిక ద్వారా మీరు అర్థవంతమైన, స్పూర్తిదాయకమైన విషయాలను పంచుకుంటావని ఆశిస్తున్నాను అంటూ భార్యకు మద్దతు ఇచ్చారు.
అన్నా లెజినోవా పోస్ట్
అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్ వెల్‌కమ్ చేబుతూ చిరంజీవి సైతం స్టోరీ పెట్టారు. అన్నా ఇన్‌స్టాలోకి వచ్చిన సందర్బంగా ఇవాళ మరో పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబులతో కలిసి దిగిన ఫోటోలను ఆమె షేర్ చేస్తూ.. కొణిదెల ఫ్యామిలీలోకి తాను అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు వచ్చిన సపోర్టు.. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నేను ఒక కుటుంబంలోకి వచ్చాను, అక్కడ అప్పటికే అందరూ ఒకరికొకరు చెందినవారే. అప్పుడు వారితో ఎలా ఇమడాలో నాకు తెలియలేదు.
ఏమని పిలవాలో తెలియదు..
ఎవరిని ఏమని పిలవాలో కూడా తెలియలేదు. అందుకే మా ఆయన దగ్గర నుంచే ఆ పిలుపును తీసుకుని అన్నయ్య.. చిన్న అన్నయ్య అని పిలవడం ప్రారంభించాను. మొదట్లో ఇదోక మాట మాత్రమే. కానీ, కాలక్రమేణా అది నాలో ఒక భావనగా మారింది. తర్వాత వారిని పిలవడానికి మరో మార్గం కూడా ఉందని తెలుసుకున్నా. కానీ, అప్పటికే వారు అన్నయ్య అనే భావన నాలో నిండిపోయింది. ఎందుకంటే నాకు అన్నయ్య లేరు. ఆ లోటును వారిలో చూసుకున్నా. వరుసల పరంగా పిలుపు వేరైనప్పటికీ మనసుతో వారిని నా సొంత సోదరులు గానే భావిస్తున్నా” అంటూ రాసుకొచ్చారు.

24 గంటల్లో 273k ఫాలోవర్స్
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, చిరంజీవి మధ్యలో నిలిచిన హ్యాపీ నవ్వుతున్న ఫోటోతో పాటు గబాబుతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న ఫోటోల షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ మెగా ఫ్యాన్స్ బాగా ఆకట్టుకుంటుంది. కాగా అన్నా లెజినోవా ఇన్‌స్టాగ్రామ్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆమె వేలల్లో ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పటి వరకు ఆమె 273k ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పటికే అదే స్పీడ్‌తో ఆమె ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. కాగా రష్యాకు చెందిన అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్‌ని ప్రేమ వివాహం చేసుకున్నారు. తీన్‌మార్ మూవీ సమయంలో వీరిద్దరి పరచయం ఏర్పడగా.. 2013 సెప్టెంబర్ 30న వివాహ చేసుకున్నారు. 2014లో వీరికి పొలెనా అంజన పవనోవిచ్ జన్మించగా.. 2017లో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించాడు.
Also Read: Pawan Kalyan Wife: అన్నా లెజినోవా కీలక నిర్ణయం.. భార్యకు ఘన స్వాగతం పలికిన వపన్ కళ్యాణ్

