Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభPawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ డబ్బింగ్ పూర్తిచేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ డబ్బింగ్ పూర్తిచేసిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu). ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండటంలో ఎన్నోసార్లు వాయిదాపడిన ఈ మూవీ.. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాజాగా డబ్బింగ్ పార్ట్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘‘హరిహర వీరమల్లు’ డబ్బింగ్‌ను అన్‌స్టాపబుల్‌ ఫోకస్‌, ఫైర్‌తో పవన్‌కల్యాణ్‌ పూర్తి చేశారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్‌ కారణంగా రాత్రి 10 గంటలకు డబ్బింగ్‌ మొదలవగా ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేశారు. వర్‌ తుపానుకు సిద్ధంగా ఉండండి. జూన్‌ 12న మీ ఉత్తేజం ఉరకలేస్తుంది’ అని పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad