HomeTop StoriesPeddi Movie: తెలంగాణలో రెంటల్‌ విధానంలోనే పెద్ది ప్రదర్శన.. మెగాస్టార్‌ జోక్యంతో వివాదానికి ఎండ్‌కార్డ్‌..!

Peddi Movie: తెలంగాణలో రెంటల్‌ విధానంలోనే పెద్ది ప్రదర్శన.. మెగాస్టార్‌ జోక్యంతో వివాదానికి ఎండ్‌కార్డ్‌..!

Peddi Controversy settled with Chiranjeevi: తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య జరుగుతున్న పర్సంటేజీ వివాదానికి ఎట్టకేలకు పుల్‌స్టాప్‌ పడింది. అగ్ర నటుడు మెగాస్టార్‌ చిరంజీవి జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఇవాళ మెగాస్టార్‌ చిరంజీవితో నిర్వహించిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ భేటీలో సినీ పరిశ్రమలో పర్సంటేజీల వివాదం సద్దుమణిగింది. చిరంజీవి జోక్యంతో పర్సంటేజీ నిర్ణయం వాయిదా పడింది. జూన్‌ 4న విడుదల కానున్న ‘పెద్ది’ సినిమాను రెంటల్‌ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. జూన్‌ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలకు మాత్రం పర్సంటేజీ విధానం వర్తింపజేస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ కమిటీ నివేదిక మేరకు నడుచుకోవాలని సూచించారు.

- Advertisement -

Also read: Vijay meets Modi: ప్రధాని మోదీతో సీఎం విజయ్‌ భేటీ.. ఆ డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి..!

ఎట్టకేలకు పెద్దికి తొలగిన అడ్డంకి..

సింగిల్‌ స్క్రీన్లలోనూ పర్సంటేజీ విధానంలోనే సినిమాలను ప్రదర్శిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. సమస్య పరిష్కారం కోసం చలన చిత్ర వాణిజ్య మండలి.. ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబ్యూటర్లతో ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే, ‘పెద్ది’ చిత్రాన్ని రెంటల్‌ విధానంలో ప్రదర్శించలేమని ఓ సమావేశంలో పలువురు ఎగ్జిబిటర్లు అభిప్రాయం వ్యక్తంగా చేయగా.. కొందరు నిర్మాతలు వ్యతిరేకించారు. దీంతో, ఈ వ్యవహారంపై చిరంజీవి జోక్యం చేసుకున్నారు. ఈనెల 25న ఆయనతో భేటీ అయిన ఎగ్జిబిటర్లు.. నేడు (బుధవారం) మరోసారి సమావేశమై, తుది నిర్ణయాన్ని వెల్లడించారు. మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రమే ‘పెద్ది’. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News