Buchi Babu – Peddi : టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా బాలీవుడ్ నుంచి ఓ బంపరాఫర్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో పెద్ది మూవీ చేస్తున్నాడు బుచ్చిబాబు సానా. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్ మూవీపై పాన్ ఇండియన్ లెవెల్‌లో హై రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజైన చికిరి సాంగ్ అభిమానులను ఉపేస్తోంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ పాట ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్‌లో రామ్‌చరణ్ తన స్టెప్పులతో అదరగొట్టాడు.
కాగా పెద్ది మూవీ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ లోగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసి జనవరి నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటివరకు రిలీజ్ చేసిన పెద్ది ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా బుచ్చిబాబు టేకింగ్ అద్భుతమంటూ ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడితో నెక్స్ట్ సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్స్ రెడీ అయ్యారు. కానీ బుచ్చిబాబు మాత్రం టాలీవుడ్ హీరోలకు హ్యాండిచ్చి బాలీవుడ్‌లో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా ఫిక్సైనట్లు ప్రచారం జరుగుతోంది. రా అండ్ రస్టిక్‌గా సాగే మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందట. బుచ్చిబాబు సినిమాలో తన వయసుకు తగ్గ పాత్రలోనే షారుఖ్‌ఖాన్ కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. చిన్నారితో షారుఖ్ ఖాన్ అనుబంధం, వీరిద్దరు కలిసి సాగించే జర్నీ నేపథ్యంలో డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
జవాన్ బ్లాక్‌బస్టర్ తర్వాత సౌత్ డైరెక్టర్లతోనే సినిమాలు చేసేందుకు షారుఖ్‌ఖాన్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలోనే బుచ్చిబాబు చెప్పిన పాయింట్ నచ్చడంతో ఈ సినిమాకు షారుఖ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో షారుఖ్‌ఖాన్, బుచ్చిబాబు సానా సినిమాపై అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి షారుఖ్‌ఖాన్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం.
పెద్ది రిలీజ్ తర్వాత షారుఖ్ ఖాన్ మూవీపై బుచ్చిబాబు సానా ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నాడట. మరోవైపు ప్రస్తుతం షారుఖ్‌ఖాన్ కింగ్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది.


