Peddi New Release Date: వెయిట్ ఈజ్ ఓవర్… ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ పై ప్రకటన వచ్చింది. కాగా కొద్ది రోజులుగా రామ్ చరణ్ పెద్ది మూవీ రిలీజ్ చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పెద్ది ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ మూవీ టీం పెద్ది రిలీజ్ డేట్ ప్రకటన ఇచ్చింది. జూన్ 4న మూవీని విడుదల చేస్తున్నట్టు మూవీ టీం వెల్లడించింది.
ప్రెస్ మీట్ లో ప్రకటన
షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో మూవీ టీం శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పెద్ది రిలీజ్ డేట్ పై స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ నిజం కాదని ఫ్యాన్స్ కి భరోసా ఇస్తూ.. జూన్ 4న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో అభిమానులంత ఊపిరి పీల్చుకుంటున్నారు. అనుకున్న దానికంటే ఇంకాస్తా ముందుగానే మూవీ రిలీజ్ డేట్ ఉండటంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నిజానికి పెద్ది మూవీ మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. సినిమాని వాయిదా వేస్తూ ఏప్రిల్ 30 కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
ఆ రూమర్స్ కి చెక్
కానీ, ఈ తేదీకి కూడా పెద్దిని రిలీజ్ చేయడం లేదంటూ ఇటీవల మేకర్స్ ప్రకటన ఇచ్చారు. దీంతో అభిమానులంత నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ది రిలీజ్ పై ఎన్నెన్నో సందేహాలు, రూమర్స్ మొదలయ్యాయి. ఈ సినిమాని జూన్ 25న రిలీజ్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. దీంతో పెద్ది కొత్త రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ లో సంధిగ్దత నెలకొంది. ఈ క్రమంలో నేడు మే1న పెద్ది కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించి అభిమానులకు శుభవార్త అందించారు మేకర్స్. కాగా ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సంతీష్ కిలారు నిర్మిస్తున్నారు. జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Grit is his story. Determination is his weapon 🔥#PEDDI WORLDWIDE RELEASE ON 4th JUNE, 2026 ❤🔥
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani @IamJagguBhai @divyenndu @vriddhicinemas… pic.twitter.com/LDcjfAcDaS
— Vriddhi Cinemas (@vriddhicinemas) May 1, 2026

