Peddi OTT: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘పెద్ది’ చిత్రం థియేటర్లలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 4న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
నెట్‌ఫ్లిక్స్‌కి ఓటీటీ రైట్స్
తాజాగా చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. పెద్ది థియేట్రికల్ రన్ పూర్తవ్వడంతో ఒప్పందం ప్రకారం సినిమాని డిజిటల్ ప్రిమియంకు ఇచ్చేందుకు సదరు సంస్థ రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో మూవీ ఓటీటీ రిలీజ్‌ని జూలై 9 ఖరారు చేసి ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ‘పెద్ది’ ఓటీటీ వేదికపై కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించారు. అలాగే జగపతి బాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘పెద్ది’ ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’.. డిలీటేడ్ సీన్స్ చూశారా?

