నిర్మాత దిల్ రాజుకు మరో షాక్ తగిలింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై ఏపీ హైకోర్టులో పిల్ ఫైల్ అయింది. ఈ మూవీ బడ్జెట్, కలెక్షన్ల విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పిటిషనర్ న్యాయస్థానంలో ఈ పిల్ ను దాఖలు చేశారు. ఈ సినిమా అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, ఐటీ, ఈడీ, జీఎస్టీతో విచారణ జరిపించాలని పేర్కొన్నారు.
నిజానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ.. వెంకటేష్ సినీ కెరీర్ లో ఏ సినిమా సాధించనంతగా ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక మెత్తంగా ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పటివరకూ రూ.230కోట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా హిట్ తో పలు వివాదాలు సైతం చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగగా.. తాజాగా ఏపీ హైకోర్టులో ఈ సినిమా ఆదాయంపై పిల్ ఫైల్ అయింది. సినిమా అదనపు షోస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు జారీ చెయ్యాలని పిటీషనర్ పేర్కొంటూ హైకోర్టులో పిల్ వేయటం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. ఈ సినిమా హిట్ టాక్ తో పాటు వందల కోట్ల వసూళ్లు సాధించిన కొన్ని రోజులకే నిర్మాత దిల్ రాజు ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగాయి. ఈ విషయం ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు హై కోర్టులో కేసు ఫైల్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో.. వెంకటేష్ హీరోగా నటించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ.. దూసుకుపోతోంది. విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రిమార్కబుల్ ట్రెండ్ ను తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా సాలిడ్ జోరుని చూపెడుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాలన్నింటిలో ఈ సినిమా టాప్ గా నిలిచింది. హిట్ టాక్ తో దూసుకుపోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ. 200కోట్ల వసూళ్లు దాటేసి నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది.
ఇప్పటికీ విడుదలై పది రోజులు దాటుతున్నా థియేటర్స్ ముందు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. అమెరికాలో సైతం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు 2.3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పటివరకు ఆయన నటించిన చిత్రాల్లో ‘ఎఫ్2’ మూవీ అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది.