‘ప్రేయసి రావే‘ ఫేమ్ డైరెక్టర్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు. ప్రేమ, సునిశితమైన హాస్యం, సెంటిమెంట్, తండ్రీకూతుళ్ల అనుబంధం వంటి భావోద్వేగ అంశాలతో పాటు యువతకు ఒక మంచి సందేశాన్ని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు మహేష్ చంద్ర తెలిపారు. మన చుట్టూ కనిపించే సహజమైన పాత్రలు, సంఘటనలతో సినిమా ఎంతో సహజంగా ఉంటుందని, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని ఆయన చెప్పారు. నటుడు బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుందని, ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ఇందులో కీలక పాత్రలో నటించారని, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో పాటు రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని, నిజంగా కెమెరా పెట్టి లైవ్ చేసినట్టుగా ఈ సినిమా ఉంటుందని, ఇలాంటి కాన్సెప్టులు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అని మహేష్ చంద్ర తెలిపారు. ఇరుముడి, విశ్వనాథం అండ్ సన్స్, మా ఇంటి బంగారం తరహా లోనే ఈ సినిమా కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అవుతుందని మహేష్ చంద్ర అభిప్రాయాన్నివ్యక్తంచేశారు. ఇంకా ఈ చిత్రంలో జయవాహిని, అన్నపూర్ణమ్మ, దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, జబర్దస్త్ శేషు తదితరులు తారాగణం. ఈ చిత్రానికి స్టోరీ డెవలప్మెంట్, డైలాగ్స్ : శ్రీరామ్ ఏదోటి, ఎడిటర్: బి.సత్యనారాయణ, మ్యూజిక్: జి.సి. క్రిష్.
Tollywood: యువతకు సందేశాన్నిస్తూ ‘పిఠాపురంలో..అలా మొదలైంది’.. 18న రిలీజ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

