Monday, February 24, 2025
Homeచిత్ర ప్రభGame Changer: 'గేమ్‌ ఛేంజర్' మూవీ టీమ్‌పై పోలీసులకు ఫిర్యాదు

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్’ మూవీ టీమ్‌పై పోలీసులకు ఫిర్యాదు

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘గేమ్‌ ఛేంజర్'(Game Changer) మూవీ ఇటీవల సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. డివైడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడంలో విఫలమైంది. దీంతో నిర్మాత దిల్ రాజు భారీగా నష్టపోయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ‘గేమ్‌ ఛేంజర్’ మూవీ యూనిట్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ మూవీ షూటింగ్ కోసం గుంటూరు, విజయవాడ నుండి హైదరాబాద్‌కి 350 మంది వెళ్లామని బాధితులు తెలిపారు.

- Advertisement -

అయితే కో డైరెక్టర్ స్వర్గం శివ తమకు రూ.1200 ఇస్తానని ఒప్పుకొని డబ్బులు ఇవ్వట్లేదని గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆర్టిస్ట్ తరుణ్. నిర్మాత దిల్ రాజు తమకు న్యాయం చేయాలని, మోసం చేసిన స్వర్గం శివపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ ఘటన ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిన వారు ఆర్టిస్టుకు రూ.1200 లెక్కన చెల్లించకపోవడం ఏంటని షాక్ అవుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి ఈ విషయంపై దిల్ రాజు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News