Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభSanthanam: గోవింద నామాలతో పేరడీ సాంగ్.. వివాదంలో కమెడియన్ సంతానం

Santhanam: గోవింద నామాలతో పేరడీ సాంగ్.. వివాదంలో కమెడియన్ సంతానం

తమిళ్ స్టార్ కమెడియన్ సంతానం(Santhanam ) ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘డీడీ నెక్స్ట్ లెవల్’ సినిమా మే 16న రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాట వేంకటేశ్వరస్వామి భక్తులను కించపరిచేలా ఉంది. గోవింద నామాలతో పేరడీ సాంగ్ చేశారు. ‘పార్కింగ్ డబ్బులు గోవిందా.. పాప్ కార్న్ ట్యాక్స్ గోవిందా..’ అంటూ గోవింద నామాలను ర్యాప్ సాంగ్‌గా మార్చారు. ఈ పాట వైరల్ కావడంతో హిందూ భక్తులు మూవీ మేకర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో పలు చోట్ల సంతానంతో పాటు మూవీ యూనిట్‌పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. పాటని వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

అయితే తాజాగా ఈ వివాదంపై సంతానం స్పందించాడు. తిరుమల శ్రీవారిని అవమానించలేదని.. సెన్సార్ బోర్డు నిబంధనల మేరకే పాట తీశామన్నారు. ఎవరికో సామాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు. దీంతో సంతానం వ్యాఖ్యలపై మరింతగా భక్తులు మండిపడుతున్నారు. మరోవైపు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad