Wednesday, January 8, 2025
Homeచిత్ర ప్రభAllu Arjun: అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు

Allu Arjun: అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు

హీరో అల్లు అర్జున్‌(Allu Arjun)కు పోలీసులు మరోసారి నోటీసులు అందించారు. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈమేరకు గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి వెళ్లి ఆయనకు నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

మరోవైపు ఆదివారం కూడా అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్‌ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావొద్దని సూచించారు. ఆసుపత్రికి ఆయన వస్తున్నారన్న సమాచారంతో ఈ నోటీసులు ఇచ్చారు. కోర్టు ఇచ్చిన బెయిల్‌ షరతులు తప్పనిసరిగా పాటించాలన్నారు. బాలుడి పరామర్శకు వస్తే కచ్చితంగా తమ సూచనలు పాటించాలన్నారు. లేదంటే అక్కడ ఏదైనా జరిగితే అందుకు పూర్తి బాధ్యత బన్నీనే వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే నాంపల్లి కోర్టు ఆదేశాలతో ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అల్లు అర్జున్ సంతకాలు చేశారు. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలని న్యాయస్థానం బెయిల్ షరతుల్లో పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News