హీరో అల్లు అర్జున్(Allu Arjun)కు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. రాంగోపాల్ పేట పోలీసులు బన్నీ ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను పరామర్శించడానికి అల్లు అర్జున్ వెళ్తున్నారనే సమాచారంతో ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. హాస్పిటల్ దగ్గరకు వెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తమ సూచనలు కాదని ఆసుపత్రికి వెళ్తే అక్కడ జరిగే పరిణామాలకు అల్లు అర్జునే పూర్తిగా బాధ్యత వహించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
మరోవైపు కాసేపట్లో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ నేపథ్యంలో ప్రతి ఆదివారం పోలీసుల ముందు హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బెయిల్ షరతుల దృష్ట్యా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయనున్నారు.