Homeచిత్ర ప్రభPooja Hegde: బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్..!

Pooja Hegde: బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్..!

Pooja Hegde: ముకుంద లాంటి మీడియం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే.. ఆ తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆమె కెరీర్ లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్న మాట వాస్తవం. ఇండస్ట్రీకొచ్చిన ప్రారంభంలో ఫ్లాపులొచ్చి డైలమాలో పడింది. కానీ, అదృష్టం కొద్దీ అవకాశాలు రావడం.. సక్సెస్ కావడంతో అటు తమిళంలో ఇటు తెలుగులో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా అందరి దృష్టిని ఆకర్షించింది.

- Advertisement -

అలా.. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తోంది ఈ పొడుగుకాళ్ళ సుందరి. ప్రస్తుతం పూజా.. బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ, టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించిన ఆమెకు సూపర్ హిట్స్ దక్కాయి. అయితే, అనూహ్యంగా పూజాకి, టాలీవుడ్ లో మార్కెట్ బాగా డౌన్ అయింది. ఇప్పుడు మళ్లీ నెమ్మదిగా అవకాశాలు వస్తున్నట్లు మీడియా వర్గాలలో చెప్పుకుంటున్నారు. అలాగే, ఆల్రెడీ బాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.

Also Read – Mrunal Thakur Bipasha Basu: మృణాల్ ఠాకూర్.. బిపాసా బసు వివాదం.. వైరల్ అవుతోన్న మాటల యుద్ధం

తమిళంలో విజయ్ సరసన ‘జన నాయగన్’ మూవీతో బిజీగా ఉన్న పూజా.. హిందీలో మాత్రం చాలా బిజీగా ఉంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు ‘కూలీ’ మూవీతో వచ్చింది. ఇందులో ‘మోనిక’ సాంగ్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అయితే, రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అప్పట్లో టాలీవుడ్ ప్రేక్షకుల గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన పూజా, ఇప్పుడేమో బాలీవుడ్ మీద నిందలు వేసింది.

నాకు హిందీలో సరైన పాత్రలు ఇవ్వలేదని షాకింగ్ కామెంట్స్ చేసింది పూజ. బాలీవుడ్ మేకర్స్ నన్ను, గ్లామర్ హీరోయిన్ గానే చూశారని, పెద్దగా గుర్తింపు లేని పాత్రలు ఇచ్చారంటూ పూజా చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. హిందీలో ఇప్పటి వరకూ నేను చేసిన రోల్స్ ఏవి కూడా గుర్తు పెట్టుకునేవి కావని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కానీ, సౌత్ లో నాకు మంచి రోల్స్ ఇచ్చారని తెలిపింది. ‘రెట్రో’ మూవీలో కార్తీక్ సుబ్బరాజ్ మంచి పాత్ర ఇచ్చారని పొగడ్తలతో ముంచేసింది. ఇప్పుడు పూజా చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి.

Also Read – Raghunandanrao: రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే బ్యాలెట్‌ ఎన్నికలు: ఎంపీ రఘునందన్‌రావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News