Dhanush: అల వైకుంఠపురములో (Ala Vaikuntapuramuloo) సినిమాతో బుట్ట బొమ్మగా పాపులర్ అయిన పూజా హెగ్దే (Pooja Hegde)కి ఈ మధ్య చేసిన సినిమాలన్నీ ఆశించిన విజయాలను ఇవ్వడం లేదు. ఒకరకంగా ఈ పొడుగు కాళ్ళ సుందరి రేసులో వెనకబడిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వరుస హిట్స్‌తో పాన్ ఇండియా హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్నతో పోల్చుకుంటే పూజా సక్సెస్‌లకి చాలా దూరంలో ఉన్నట్టు. వరుస ఫ్లాప్స్ వస్తున్నా కూడా కీర్తి సురేశ్ (Keerthy Suresh) రేంజ్‌లో ఈ బుట్ట బొమ్మకి అవకాశాలు రావడం లేదు.
ఇక సౌత్ లో పూజాకి బొత్తిగా అవకాశాలు కరువయ్యాయని చెప్పుకుంటున్నారు. కానీ, అది నిజం కాదు. ఈ బ్యూటీకి తెలుగులో మాత్రమే ఆఫర్లు లేవు. తమిళంలో మాత్రం బిజీగానే ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన రెట్రో మూవీ (Retro Movie)తో వచ్చింది. అయితే, రెట్రో బాక్సాఫీస్ వద్ద చతికిల పడి అమ్మడిని బాగా నిరాశపరిచింది. అయినా తమిళంలో పూజా హెగ్దే వరుసగా ఛాన్సులు అందుకుంటోంది. ప్రస్తుతం దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా రూపొందుతున్న జన నాయగన్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.
పూజా హెగ్డే ఇప్పుడు కోలీవుడ్‌పై స్పెషల్ స్పోకస్ చేసినట్లు కనిపిస్తోంది. గతంలో విజయ్ సరసన హీరోయిన్‌గా బీస్ట్ (Beast) అనే సినిమాను చేసింది. ఇప్పుడు ఇదే కాంబోలో మళ్ళీ జన నాయగన్ (Jana Nayagan) రిపీట్ అవుతోంది. ఇది కాకుండా తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోనూ హీరోయిన్‌గా పూజా ఎంపికైందని తెలుస్తోంది. ఇటీవల కుబేర మూవీతో పాన్ ఇండియా వైడ్‌గా ధనుష్ మంచి హిట్ అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించబోతున్నారట. ఇందులో బుట్టబొమ్మని ఫైనల్ చేశారట. తెలుగులో గ్యాప్ వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం దూసుకెళుతోంది.
పూజా హెగ్డే ఐటం సాంగ్స్ కూడా చేసేందుకు రెడీగా ఉంటుంది. రంగస్థలం (Rangasthalam), ఎఫ్ 3 మూవీస్‌లో ఇప్పటికే ఐటం సాంగ్స్ చేసి హీటెక్కించిన అమ్మడు ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న కూలీ మూవీలో కూడా స్పెషల్ నంబర్ ఒకటి చేసింది. ఈ సాంగ్ పూజాకి బాగా ప్లస్ అవుతుందని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఏదో రకంగా పూజా అవకాశాలు అందుకోవడంలో బాగానే తెలివితేటలు చూపిస్తోంది. ఇంతకాలం స్కిన్ షోతో నెట్టుకొచ్చింది. ఇప్పుడు మాత్రం కథా బలమున్న పాత్రలకే సై అంటోంది.