Wednesday, January 14, 2026
Homeచిత్ర ప్రభThe Raja Saab Collections: ‘ది రాజా సాబ్’ ఫస్ట్ డే కలెక్ష‌న్స్‌.. రూ.100 కోట్ల...

The Raja Saab Collections: ‘ది రాజా సాబ్’ ఫస్ట్ డే కలెక్ష‌న్స్‌.. రూ.100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన ప్ర‌భాస్‌

The Raja Saab Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ ఫ‌స్ట్ డే మంచి క‌లెక్ష‌న్స్‌నే రాబ‌ట్టుకుంద‌ని ట్రేడ్ స‌ర్కిల్స్ అంటున్నాయి. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై తొలి రోజే రికార్డు స్థాయి వసూళ్లతో సంచలనం సృష్టించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘ది రాజా సాబ్’ సినిమా విడుదలైన మొదటి రోజే అన్నీ భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.90 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. గ్రాస్ వ‌సూళ్ల ప‌రంగా ఇది వంద కోట్ల‌ను క్రాస్ చేసిన‌ట్టు టాక్‌. గురువారం నిర్వహించిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా రూ.9.15 కోట్లు, శుక్రవారం ఒక్కరోజే రూ.45 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు సమాచారం.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సూప‌ర్బ్ రెస్పాన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌కు ర‌ప్పించింది. కేవలం తెలుగు వెర్షన్ నుంచే దాదాపు రూ.47.4 కోట్ల నెట్ వసూళ్లు నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సినిమా సగటున 57 శాతం పైగా ఆక్యుపెన్సీని నమోదు చేసింది. నైజాం ఏరియాలో మాత్రమే రూ.17 కోట్ల షేర్ వసూలు కావడం విశేషం. దీంతో ఇక్క‌డ మ‌రోసారి ప్రభాస్ తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నారని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి.

Also Read – The Rajasaab Ott: ‘రాజా సాబ్’ ఓటీటీ అప్డేట్.. ఎప్పుడు? ఎక్కడంటే?

నార్త్ ఇండియాలో ‘ది రాజా సాబ్’ మంచి ఎఫెక్ట్‌నే చూపించింది. హిందీ బెల్ట్‌లో ఈ చిత్రం తొలి రోజు రూ.6.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. తమిళం, కన్నడ, మలయాళ భాషలలో కలిపి సుమారు రూ.60 లక్షల వరకు వసూలైనట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ సినిమా మంచి క‌లెక్ష‌న్స్‌ను నమోదు చేసుకుని రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్లు టాక్‌.

సినిమాకు ప్రారంభంలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ప్రభాస్ క్రేజ్, మారుతి మార్క్ కామెడీ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తున్నాయి. ఒక హారర్ కామెడీ చిత్రానికి ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం భారతీయ సినీ చరిత్రలో అరుదైన విషయంగా ట్రేడ్ వర్గాలంటున్నాయి. ప్ర‌భాస్ స‌ర‌స‌న మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు. లాంగ్ వీకెండ్ కావడంతో రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని బాక్సాఫీస్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read – Ram Gopal Varma: సెన్సార్ బోర్డ్ ఓ జోక్ – ఆడియెన్స్‌ను అవ‌మానిస్తోంది – ఆర్‌జీవీ ట్వీట్ వైర‌ల్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News