The Raja Saab Sequel: ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకదాన్ని మించి మరో క్రేజీ ప్రాజెక్ట్‌ని ఆయన లైనప్ చేసుండటంతో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ఆసక్తి ఓ పక్క.. నెక్ట్స్ డార్లింగ్ ఏ సినిమా స్టార్ట్ చేస్తాడోనని క్యూరియాసిటీ మరో వైపు అందరిలోనూ మొదులుతుంది. ఇప్పటికే ది రాజా సాబ్ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. ఫౌజీ సినిమా సెట్స్‌లో ఉంది. స్పిరిట్ షురూ కాబోతుంది. మరో వైపు కల్కి 2 మేకర్స్ ఓ వైపు, సలార్ 2 మేకర్స్ మరో వైపు ప్రభాస్ రాక కోసం వెయిటింగ్. ఇలాంటి తరుణంలో ఓ మూవీ సీక్వెల్ చేయటానికి ప్రభాస్ ఆసక్తిగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మూవీ ఏదో కాదు.. ‘ది రాజా సాబ్’.
ప్రభాస్, మారుతి కాంబోలో రాబోతున్న ‘ది రాజా సాబ్’ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో రీసెంట్‌గా డైరెక్టర్ మారుతి, ప్రభాస్‌ను కలిసి ఓ లైన్‌ను వినిపించాడట. అది ప్రభాస్‌కు నచ్చింది. పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి వినిపించమని చెప్పాడట. ‘ది రాజా సాబ్’కు అది సీక్వెల్‌గా రానుంది. సినిమా ఎండింగ్‌లో సీక్వెల్ ఉంటుందనేలా చూపించబోతున్నారు. ఇప్పుడు మారుతి ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు. పూర్తి స్క్రిప్ట్ ప్రభాస్‌కి నచ్చితే మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడనటంలో సందేహం లేదు.
Also Read – Bigg Boss Promo: ఒక్కరైనా ఓకే.. తనూజతో అమర్, అర్జున్ ల డీల్ సెట్
అయితే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అంటే ఇప్పటికే అభిమానుల్లో కాస్త అంసతృప్తి ఉంది. అయితే ‘ది రాజా సాబ్’ సూపర్ డూపర్ హిట్ అయితే వాళ్ల ఓపినియన్ మారుతుంది. కానీ ఏ మాత్రం తేడా కొట్టినా ‘ది రాజా సాబ్’ సీక్వెల్‌కు అభిమానులు ఒప్పుకోరు. ప్రభాస్ కూడా ఆలోచనలో పడతాడనటంలో సందేహం లేదు. ఇన్ని ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సిన తరుణంలో సీక్వెల్‌ను ఎప్పుడు చేస్తాడనేది అందరినీ ఆలోచింప చేస్తుంది. ఇప్పటికే ప్రభాస్ సినిమాలను లిస్టుని గమనిస్తే అన్నీ సీక్వెల్స్ ఉన్నాయి. ఇప్పుడు మరోటి యాడ్ కాబోతోంది మరి. ఇవి కాకుండా ఫౌజీ సినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. మరో వైపు సందీప్ వంగా చేసే సినిమాకు కూడా సీక్వెల్ ఉంటే మాత్రం.. ఇక ప్రభాస్ సీక్వెల్ కింగ్ అయిపోతాడనటంలో సందేహం లేదు.
Also Read – Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో హైడ్రా కమిషనర్ భేటీ.. వాటిపైనే చర్చ.?


