Prabhas Cousin: సంబరాల ఏటిగట్టు షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు మెగా హీరో సాయిధరమ్‌తేజ్. దాదాపు 125 కోట్లతో సాయిధరమ్‌తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంబరాల ఏటిగట్టుకు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాది వేసవిలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. సంబరాల ఏటిగట్టు కంప్లీట్ కాకముందే సాయిధరమ్‌తేజ్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఔట్ అండ్ ఔట్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రభాస్ కజిన్ సిద్ధార్థ్ రాజ్‌కుమార్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.
ప్రభాస్‌కు తమ్ముడు వరుస అయిన సిద్ధార్థ్ నటుడిగా రాణించాలని అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నాలు వర్కవుట్ కాకపోవడంతో డైరెక్టర్‌గా మారబోతున్నట్లు సమాచారం. డిఫరెంట్ పాయింట్‌తో ఓ యూనిక్ లవ్‌స్టోరీని రెడీ చేసుకున్న సిద్ధార్థ్ ఇటీవలే సాయిధరమ్‌తేజ్‌ను అప్రోచ్ అయ్యాడు. ప్రభాస్ కజిన్ చెప్పిన కథ నచ్చడంతో సాయిధరమ్‌తేజ్ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Also Read – The India House: టాలీవుడ్‌లోకి ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ – మెగా ఛాన్స్ ఇచ్చిన రామ్‌చరణ్
ఈ లవ్‌స్టోరీ కోసం సాయిధరమ్‌తేజ్ స్పెషల్‌గా మేకోవర్ కానున్నట్లు సమాచారం. బరువు తగ్గబోతున్నారట. ఇందులో కంప్లీట్ క్లాస్ లుక్‌లో కనిపిస్తారని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది జూన్ లేదా జూలై నుంచి సాయిధరమ్‌తేజ్, సిద్ధార్థ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. సిద్ధార్థ్ రాజ్ కుమార్ డెబ్యూ మూవీని యూవీ క్రియేషన్స్‌తో కలిసి మరో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా సాయిధరమ్‌తేజ్ సంబరాల ఏటిగట్టు గత ఏడాది సెప్టెంబర్‌లోనే రిలీజ్ కావాల్సింది. షూటింగ్ డిలేతో పాటు వీఎఎఫ్ఎక్స్ పనుల వల్ల వాయిదా పడింది. సంబరాల ఏటిగట్టు మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read – Nagarjuna: బంగార్రాజు మూడో పార్ట్ రెడీ – సంక్రాంతిని టార్గెట్ చేసిన నాగార్జున

