Sunday, July 13, 2025
Homeచిత్ర ప్రభPrabhas: ప్రభాస్‌ జూన్ సెంటిమెంట్.. మైథలాజికల్‌ పాత్రలతో మెప్పిస్తోన్న పాన్ ఇండియా స్టార్

Prabhas: ప్రభాస్‌ జూన్ సెంటిమెంట్.. మైథలాజికల్‌ పాత్రలతో మెప్పిస్తోన్న పాన్ ఇండియా స్టార్

Rudra: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పక్కా కమర్షియల్ సినిమాలే కాదు మైథలాజికల్ సినిమాలతోనూ భారీ క్రేజ్‌ను తెచ్చుకున్నారు. తాజాగా వచ్చిన కన్నప్ప సినిమా సక్సెస్ కారణం ప్రభాస్ పోషించిన రుద్ర పాత్రేనని ఎంతో గొప్పగా ప్రతీ ఒక్కరు చెప్పుకుంటున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత నుంచి ప్రభాస్ హిట్ ఫ్లాప్స్ తో పనిలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఆయ‌న రీసెంట్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన సినిమాల‌ను గ‌మ‌నిస్తే డార్లింగ్‌కు జూన్ నెల బాగా క‌లిసొస్తుంద‌ని అంటున్నారు ఆయ‌న అభిమానులు.

- Advertisement -

ఇంత‌కీ ప్యాన్స్ ప్రభాస్ కి జాన్ నెల బాగా కలిసి వస్తుందని చెప్పుకోవ‌టానికి బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయండోయ్‌. జూన్ నెలలో వస్తున్న సినిమాలు మూడేళ్లుగా చూసుకుంటే అవన్నీ మైథలాజికల్ సినిమాల కావ‌టం విశేషం. 2023లో ఆది పురుష్ మూవీతో వచ్చారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్న‌ప్ప‌టికీ డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమా ఫలితం గురించి పక్కన పెడితే ప్రభాస్ కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. రాముడిగా ఆయన నటన అద్భుతం అన్నారు. ఆ తర్వాత 2024లో కల్కి 2898 ఏడీతో వచ్చి హిట్ అందుకున్నారు. ఇందులో క‌ర్ణుడి పాత్ర‌లో ప్ర‌భాస్ వావ్ అనిపించారు. క‌ల్కి పార్ట్ వ‌న్‌లో చివ‌రి ప‌దిహేను నిమిషాలు మాత్ర‌మే ఉండే ఈ పాత్ర.. ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేసింది. ప్ర‌భాస్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇక కల్కి పార్ట్ 2లో ఈ పాత్ర నిడివి ఎంతసేపు ఉంటుంద‌నేది తెలియాలంటే మ‌రికొన్నాళ్లు ఆగాల్సిందే. ఇక 2025లో కన్నప్పతో వచ్చారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/master-revanth-in-chiranjeevi-and-anil-ravipudi-film/

మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి అగ్ర తారాగణం నటించిన కన్నప్ప జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ అయినప్పటికీ, అందరూ మాట్లాడుకుంటుంది మాత్రం ప్రభాస్ పోషించిన రుద్ర పాత్ర గురించే. ప్ర‌భాస్ ఉన్న న‌ల‌బై నిమిషాలు సినిమా ఓ రేంజ్‌లో ఆడియెన్స్‌ను క‌ట్టి ప‌డేసింద‌నే చెప్పాలి. రాముడు, కర్ణుడు పాత్రలకంటే కన్నప్పలో పోషించిన రుద్ర ఇంకో లెవల్ అంటున్నారు. కన్నప్ప సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్ కనిపించనప్పటికీ సినిమాలో మాత్రం ఆయనే హైలెట్ గా నిలిచారు.

దీంతో ప్రభాస్ కి ఎలాంటి పాత్రలైనా బాగా సూటవుతాయని, ఆయన ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలరని ఆదిపురుష్, కల్కి, కన్నప్ప సినిమాలను చూసి అంటున్నారు. ఇకవైపు ఇలా మైథలాజికల్ సినిమాలు చేస్తూనే మరోవైపు సలార్ లాంటి పూర్తి యాక్షన్ సినిమాలను, ది రాజాసాబ్ లాంటి హర్రర్ అండ్ కామెడీ జోనర్ సినిమాలను చేస్తున్నారు. ఇటీవల వచ్చిన రాజాసాబ్ టీజర్ తో ఇన్నాళ్ళు ప్రేక్షకుల్లో ఉన్న సందేహాలు పటాపంచలైపోయాయి. ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధిస్తుందని టాక్ మొదలైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News