Prabhas Fauji: టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా కొనసాగుతోన్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఐదు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.
ఇటీవలే కన్నప్ప సినిమాతో ప్రేక్షకులను పలకరించారు రెబల్‌స్టార్. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ మూవీలో రుద్రగా గెస్ట్ రోల్‌లో కనిపించి అభిమానులను
అలరించారు. ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ మూలంగా కన్నప్ప తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో భారీగా ఓపెనింగ్స్ రాబడుతోంది.
ప్రభాస్ కొత్త లుక్…
గత కొన్నాళ్లుగా షూటింగ్‌లకు స్మాల్ బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ఇటీవలే ఫౌజీ సెట్స్‌లో అడుగుపెట్టారు. ఫౌజీ సెట్స్ నుంచి ప్రభాస్ లుక్‌కు సంబంధించిన కొన్ని
ఫొటోలు లీకయ్యాయి. ఈ కొత్త లుక్‌లో ఫ్యాన్స్‌తో ప్రభాస్ దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ ఫొటోల్లో బరువు తగ్గి స్టైలిష్
లుక్‌లో ప్రభాస్ కనిపిస్తున్నారు. ఫౌజీ కోసమే ప్రభాస్ ఇలా మేకోవర్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ స్లిమ్ లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
రచ్చ రచ్చే…
బ్లాక్ షర్ట్‌లో ప్రభాస్ హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వింటేజ్ ప్రభాస్‌లా కనిపిస్తున్నాడని, రెబల్ ఈజ్ బ్యాక్ అంటూ
పేర్కొంటున్నారు. ప్రభాస్ లుక్ అదిరిపోయిందని, ఈ ఛేంజ్ ఓవర్‌ను ఊహించలేదని చెబుతున్నారు. ఇదే లుక్ సినిమాలో కనిపిస్తే రచ్చే అని అభిమానులు
చెబుతోన్నారు. ఫ్యాన్స్ రియాక్షన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్నాయి.
ఎనర్జీ మిస్…
ప్రభాస్ లుక్‌పై కొన్నేళ్లుగా విమర్శలు వస్తోన్నాయి. మిర్చి మూవీ తర్వాత సరిగ్గా ఫిట్‌నెస్ మెయింటైన్ చేయలేకపోవడం, బాడీ షేఫ్ విషయంలో జాగ్రత్తలు
తీసుకోకపోవడంలో బరువు పెరిగి చాలా బొద్దుగా మారిపోయారు ప్రభాస్. మునుపటి ఎనర్జీ, గ్రేస్ మిస్సయ్యాయంటూ అభిమానులు సైతం ప్రభాస్ లుక్‌పై
ట్రోల్స్ చేస్తూ వచ్చారు. విమర్శల తాకిడి పెరిగిపోవడంతో మేకోవర్ కోసమే షూటింగ్‌లకు ప్రభాస్ కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చినట్లు చెబుతోన్నారు.
600 కోట్ల బడ్జెట్…
ఫౌజీ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. నైజాంకు రజాకార్ బ్యాక్‌డ్రాప్‌లో హిస్టారికల్ లవ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఫౌజీ మూవీలో ప్రభాస్‌కు జోడీగా సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ
ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. సీతారామం బ్లాక్‌బస్టర్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇదే.