The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులోనే అంతంత మాత్రంగా నడుస్తున్న రాజా సాబ్‌కి హిందీలో దారుణమైన దెబ్బ తగలబోతోన్నట్టుగా సమాచారం. అసలే హిందీ ఆడియెన్స్ అంతా కూడా ధురంధర్ మేనియాలో ఉన్నారు. అలాంటి వారికి మన రాజా సాబ్ అంతగా ఎక్కలేదని అర్థం అవుతోంది. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన ఏ మూవీ కూడా నార్త్ ఆడియెన్స్‌ని పూర్తిగా సంతృప్తినివ్వలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాజా సాబ్ మూవీకి తెలుగులోనే కాకుండా హిందీలోనూ భారీ నష్టాల్ని తీసుకు వచ్చేలా ఉంది.
సలార్, కల్కి చిత్రాలు మాత్రం అక్కడ మెప్పించాయి. కల్కి అయితే వెయ్యి కోట్ల క్లబ్బులో జాయిన్ అయింది. ఇక ఈ రాజా సాబ్ మూవీని ముందుగా లోకల్ ప్రొడక్ట్‌గానే స్టార్ట్ చేశారు. మధ్యలో కథను మార్చి, స్పాన్ పెంచి, బడ్జెట్ విపరీతంగా పెంచి, వాయిదాల మీద వాయిదాలు వేసి ఈ సంక్రాంతికి రాజా సాబ్‌ను దించారు. మొదటి రెండు మూడు రోజుల్లోనే 500 కోట్ల వరకు కలెక్ట్ చేసే సత్తా ఉన్న ప్రభాస్‌కి రాజా సాబ్ రూపంలో పెద్ద దెబ్బ తగిలినట్టు అయింది.
Also Read – Director Teja: మోసగాళ్ల చేతిలో చిక్కి భారీగా నష్టపోయిన డైరెక్టర్ తేజ తనయుడు
కానీ ఇప్పటి వరకు రాజా సాబ్ మూవీకి 200 కోట్ల రేంజ్‌లోనే కలెక్షన్లను సాధించాయి. అవి కూడా తెలుగు, ఓవర్సీస్ ఆడియెన్స్ ఇచ్చిన వసూళ్లే అని తెలుస్తోంది. హిందీలో ఇది మినిమం కలెక్షన్లను కూడా రాబట్టడం లేదని తెలుస్తోంది. దీంతో హిందీలో రాజా సాబ్‌ని కొన్న వారికి కోట్లలో నష్టం వాటిల్లేలా కనిపిస్తోంది. అలా చూసుకుంటే పీపుల్స్ మీడియాకి మళ్లీ ఓ ఫ్లాప్ మూవీ వచ్చినట్టే అని చెప్పుకోవాలి.
మాకున్న అప్పులన్నీ తీర్చే సినిమా రాజా సాబ్ అంటూ టీజీ విశ్వ ప్రసాద్ పదే పదే గత కొన్నేళ్ల నుంచి చెబుతూ వచ్చాడు. కానీ రాజా సాబ్ మాత్రం లాభాల్ని కాకుండా నష్టాల్నే తెచ్చిపెట్టేలా ఉంది. ఈ సంక్రాంతి సీజన్ పూర్తయ్యే వరకు రాజా సాబ్ ఖాతాలో ఇంకెంత వచ్చి చేరుతుందో చూడాలి. ఇంకో వారం తరువాతే అసలు లెక్కలు తెలుస్తాయని సమాచారం.
Also Read – Sudha Kongara: విజయ్ అభిమానులపై లేడీ డైరెక్టర్ అసహనం

