Sunday, January 18, 2026
Homeచిత్ర ప్రభPrabhas - Rajamouli: జ‌పాన్‌లో ప్ర‌భాస్ - లెట‌ర్‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన జ‌క్క‌న్న‌

Prabhas – Rajamouli: జ‌పాన్‌లో ప్ర‌భాస్ – లెట‌ర్‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన జ‌క్క‌న్న‌

Prabhas – Rajamouli: స్పిరిట్ షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చిన రెబెల్ స్టార్ ప్ర‌భాస్ జ‌పాన్ వెళ్లారు. బాహుబ‌లి ఎపిక్ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నారు. బాహుబ‌లి రెండు భాగాల‌ను క‌లిపి బాహుబ‌లి ఎపిక్ పేరుతో ఇటీవ‌లే ఇండియాలో రిలీజ్ చేశారు. యాభై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది బాహుబ‌లి ఎపిక్‌. రీ రిలీజ్ లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఇండియ‌న్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

- Advertisement -

డిసెంబ‌ర్ 12న బాహుబ‌లి ఎపిక్‌ జ‌పాన్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం ఇటీవ‌లే ప్ర‌భాస్ జ‌పాన్ వెళ్లారు. రాజ‌మౌళి కూడా జ‌పాన్ వెళ్లాల్సింది. కానీ వార‌ణాసి షూటింగ్‌తో బిజీగా ఉండి మిస్స‌య్యారు. జ‌పాన్‌లో ఉన్న ప్ర‌భాస్‌కు రాజ‌మౌళి ఓ లెట‌ర్ రాశారు. ఈ లెట‌ర్‌ను శ‌నివారం ప్ర‌భాస్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Also Read- Meenakshi Chaudhary: అక్కినేని హీరోతో పెళ్లి – క్లారిటీ ఇచ్చిన మీనాక్షి చౌద‌రి!

జ‌పాన్‌లో ఫ్యాన్స్‌కు నువ్వంటే ఎంతో ఇష్టం. ఆ విష‌యం నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంద‌ని అనుకుంటున్నా. నేను జ‌పాన్‌కు నాలుగు సార్లు వెళ్లాను. వెళ్లిన ప్ర‌తిసారి ప్ర‌భాస్ ఎప్పుడు వ‌స్తాడ‌ని అడిగేవారు. ఆ అభిమానుల కోరిక ఫ‌లించ‌డం ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల‌కు నా బాహుబ‌లి జ‌పాన్‌లో సంద‌డి చేస్తున్నాడు అంటూ ఈ లెట‌ర్‌లో రాజ‌మౌళి పేర్కొన్నాడు. రాజ‌మౌళి రాసిన లెట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అభిమానులే కాకుండా సెలిబ్రిటీలు సైతం రాజ‌మౌళి లెట‌ర్‌కు ఫిదా అవుతున్నారు. డైరెక్ట‌ర్ సందీప్ వంగా కూడా రాజ‌మౌళి లెట‌ర్‌కు లైక్ కొట్టాడు.

బాహుబ‌లి ఎపిక్ జ‌పాన్ ప్ర‌మోష‌న్స్‌లో ప్ర‌భాస్ పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ ప్ర‌మోష‌న్స్‌లో తెలుగులో డైలాగ్స్ చెప్పి అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు ప్ర‌భాస్‌. ఈ ఫొటోల్లో ప్ర‌భాస్ స్లిమ్ లుక్‌లో క‌నిపించ‌డం కూడా ఆస‌క్తిని పంచుతోంది. స్పిరిట్ లుక్ ఇదే అంటూ నెటిజ‌న్లు కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న స్పిరిట్ మూవీ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ స్పెష‌ల్‌గా మేకోవ‌ర్ అయ్యారు. స్పిరిట్ లాంఛింగ్ ఈవెంట్‌కు ప్ర‌భాస్ అటెండ్ అయినా లుక్ లీక్ అవుతుంద‌ని అత‌డి ఫొటోల‌ను రివీల్ చేయ‌లేదు. ఫ‌స్ట్ షెడ్యూల్ షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ బ‌య‌టకు రాకుండా మేక‌ర్స్ జాగ్ర‌త్త ప‌డ్డారు. తాజాగా బాహుబ‌లి ఎపిక్ ప్ర‌మోష‌న్స్ కోసం మీడియా ముందుకు రావ‌డంతో స్పిరిట్ లుక్ ఇదేనంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read- Faria Abdullah: కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న జాతిర‌త్నాలు హీరోయిన్‌ – ద‌ళ‌ప‌తి విజ‌య్ కొడుకుతో సినిమా

జ‌పాన్ నుంచి తిరిగి వ‌చ్చిన వెంట‌నే స్పిరిట్ షూటింగ్‌ను ప్ర‌భాస్ తిరిగి మొద‌లుపెట్ట‌బోతున్నాడు. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

https://www.instagram.com/p/DR6GlRaEhVT/?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News