డ్రగ్స్(Drugs) రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) మద్దతుగా నిలిచారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ యువతకు పిలుపునిచ్చారు. ఈమేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
- Advertisement -
“లైఫ్‌లో మనకి ఎన్నో ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు ఉన్నప్పుడు.. “ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్” say no to drugs today.. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్‌కి బానిసలు అయితే వెంటనే ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది” అని పేర్కొన్నారు.