Friday, July 11, 2025
Homeచిత్ర ప్రభPrabhas - Ranveer Singh: ప్రభాస్ Vs రణ్ వీర్.. డిసెంబర్ 5న బాక్సాఫీస్ వార్

Prabhas – Ranveer Singh: ప్రభాస్ Vs రణ్ వీర్.. డిసెంబర్ 5న బాక్సాఫీస్ వార్

The Raja Saab – Dhurandhar: టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్ష‌కులు డిసెంబర్ 5 కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కారణం ఏంటంటే, ఒకే రోజు రెండు భారీ సినిమాలు.. రెండు బిగ్గెస్ట్‌ స్టార్స్ మధ్య భారీ బాక్సాఫీస్ యుద్ధం జరగనుంది. వారిద్ద‌రెవ‌రో కాదు.. ఒక‌రేమో టాలీవుడ్ డార్లింగ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కాగా, మరొక‌రు బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్ వీర్ సింగ్ (Ranveer Singh). ఇద్ద‌రూ ఒకే రోజున‌ తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ పోరులో ఎవరు నెగ్గుతారో, బాక్సాఫీస్ రికార్డులను ఎవరు తిరగరాస్తారో అనేది అంద‌రిలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది.

- Advertisement -

ముందుగా ప్ర‌భాస్ విషయానికొస్తే.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొని, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా చలామణి అవుతున్నసంగ‌తి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత వరుసగా పాన్ ఇండియా చిత్రాలు ప్రకటిస్తూ మరింత బిజీగా మారిపోయారు. భాషతో సంబంధం లేకుండా ప్రతి భాష ఇండస్ట్రీలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మారుతి (Maruthi) దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ (The Raja Saab) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్స్ అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ప్రభాస్ తన సినీ కెరీర్ లో తొలిసారి హార్రర్ జోన‌ర్ మూవీగా రాజా సాబ్‌ సినిమా చేస్తుండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. మారుతి ఈ చిత్రంలో ప్రభాస్‌ను వింటేజ్ లుక్ (Vintage Look) లో చూపించబోతున్నారు, ముఖ్యంగా అది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా ప్రభాస్‌కు పోటీగా డిసెంబర్ 5న‌ తన సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు బాలీవుడ్ స్టార్ రణ్వీర్‌ సింగ్. ర‌ణ్వీర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘దురంధర్’ (Durandhar) సినిమా నుంచి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఆదిత్య ధార్ (Aditya Dhar) దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ప్రభాస్ లాంటి భారీ స్టార్ సినిమాకు పోటీగా వస్తున్న ‘దురంధర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/before-mega-157-chiranjeevi-and-venkatesh-acted-in-another-movie/

డిసెంబర్ 5న బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్రభాస్ వర్సెస్ రణ్ వీర్ అనే పోటీ అంద‌రిలోనూ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతోంది. ఇద్దరు స్టార్ యాక్ట‌ర్స్‌ ఒకేరోజు తమ సినిమాలతో పోటీకి సిద్ధమవుతున్నారు. ‘ది రాజా సాబ్’ తో ప్రభాస్ తన హార్రర్ జానర్ డెబ్యూతో వస్తుంటే, ‘దురంధర్’ తో రణ్‌వీర్ బాలీవుడ్ మాస్ ఇమేజ్‌తో వస్తున్నారు. ఈ రెండు చిత్రాలు వేర్వేరు భాషల్లో ప్రాధాన్యత ఉన్నప్పటికీ, పాన్ ఇండియా మార్కెట్ లో ప్రభాస్‌కున్న క్రేజ్ దృష్ట్యా, ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది. మరి డిసెంబర్ 5న థియేటర్లలో ఏ సినిమా విజయం సాధిస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News