Sunday, February 15, 2026
Homeచిత్ర ప్రభPrabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ - మ‌రోసారి రాజాసాబ్ వాయిదా? - సంక్రాంతిపై గురిపెట్టిన రెబ‌ల్‌స్టార్‌!

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ – మ‌రోసారి రాజాసాబ్ వాయిదా? – సంక్రాంతిపై గురిపెట్టిన రెబ‌ల్‌స్టార్‌!

Prabhas Rajasaab: ప్ర‌భాస్ రాజాసాబ్ రిలీజ్ మ‌రోసారి పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. డిసెంబ‌ర్ నుంచి సంక్రాంతికి ఈ సినిమా షిప్ట్ కాబోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రొమాంటిక్ హార‌ర్ కామెడీ మూవీని తొలుత ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన‌ రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ అనుకున్నారు. కానీ ప్ర‌భాస్ మోకాలి గాయం ట్రీట్‌మెంట్ కోసం ఇట‌లీ వెళ్ల‌డంతో షూటింగ్ చాలా రోజులు నిలిచిపోయింది. ఈ డిలే కార‌ణంగా ఏప్రిల్‌లో రావాల్సిన సినిమాను డిసెంబ‌ర్‌కు పోస్ట్‌పోన్ చేశారు. ఈ హార‌ర్ కామెడీ మూవీని డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు.

- Advertisement -

టాకీ పార్ట్ కంప్లీట్‌..
రాజాసాబ్ టాకీపార్ట్ ఇటీవ‌ల పూర్త‌యింది. ఇంకా సాంగ్స్ షూటింగ్ బ్యాలెన్స్‌గా ఉంది. రిలీజ్‌కు మ‌రో నాలుగు నెల‌లు టైమ్ ఉండ‌టంతో మేక‌ర్స్ తొంద‌ర‌ప‌డ‌టం లేదు. ఆగ‌స్ట్‌లో ఈ సాంగ్స్ షూట్ కోసం విదేశాల‌కు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

Also Read- Ghaati: అనుష్క ‘ఘాటి’ కొత్త రిలీజ్ డేట్.. ఈ సారైనా క్రిష్ మాట నిల‌బెట్టుకుంటాడా!

200 కోట్ల బ‌డ్జెట్ అనుకున్నారు..
రాజాసాబ్ సినిమాను 200 కోట్ల బ‌డ్జెట్‌తో పూర్తిచేయాల‌ని ముందుగా నిర్మాత‌లు ప్లాన్ చేశారు. కానీ ఫైన‌ల్ అవుట్‌పుట్ వ‌చ్చేస‌రికి బ‌డ్జెట్‌ నాలుగు వంద‌ల యాభై కోట్లు దాటుతోన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భాస్‌కు ఉన్న పాన్ ఇండియ‌న్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని మేకింగ్, క్వాలిటీ విష‌యంలో నిర్మాత‌లు ఎక్క‌డ కాంప్ర‌మైజ్ కాలేద‌ని అంటున్నారు. సెట్స్ కోసం కూడా గ‌ట్టిగానే ఖ‌ర్చుచేసిన‌ట్లు స‌మాచారం. ఈ బ‌డ్జెట్‌లో ప్ర‌భాస్‌తో పాటు మిగిలిన ఆర్టిస్టుల రెమ్యూన‌రేష‌న్ వాటానే సగం వ‌ర‌కు ఉన్న‌ట్లు తెలిసింది.

సంక్రాంతి బెట‌ర్‌..
ఈ బ‌డ్జెట్‌కు సినిమా వ‌ర్క‌వుట్ కావాలంటే డిసెంబ‌ర్ కంటే సంక్రాంతి సీజ‌న్ బెట‌ర్ అనే ఆలోచ‌న‌లో నిర్మాత‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో సంక్రాంతి సీజ‌న్ పెద్ద సినిమాల‌కు బాగా క‌లిసివ‌స్తుంది. సంక్రాంతికి రిలీజైన స్టార్ హీరోల సినిమాలు చాలా వ‌ర‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. ఆ సెంటిమెంట్‌తోనే రాజాసాబ్‌ను సంక్రాంతికి షిఫ్ట్ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

డిజిట‌ల్ రైట్స్‌..
డిజిట‌ల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ డీల్ ఇంకా క్లోజ్ కాక‌పోవ‌డంతో పోస్ట్‌పోన్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. రాజాసాబ్ పోస్ట్ పోన్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఒక‌టి రెండు రోజుల్లో రావ‌చ్చున‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read- Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’కి సెన్సార్ బోర్డ్‌ షాక్.. ప‌వ‌న్‌కు ఇష్ట‌మైన వాయిసే లేపేశారుగా!

చిరంజీవి, ర‌వితేజ సినిమాలు..
మ‌రోవైపు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీతో పాటు ర‌వితేజ‌, న‌వీన్ పొలిశెట్టి సినిమాలు రిలీజ్ కానున్నాయి. సంక్రాంతి బెర్తుల‌ను ఇప్ప‌టికే ఈ ముగ్గురు హీరోలు క‌న్ఫామ్ చేసుకున్నారు. రాజాసాబ్ సంక్రాంతికి వ‌స్తే ఈ ముగ్గురు హీరోల‌కు గ‌ట్టిగానే ఎఫెక్ట్ ప‌డే అవ‌కాశం ఉంది.

నిధి అగ‌ర్వాల్‌..
రాజాసాబ్ సినిమాకు మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్‌, రిద్ది కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News