ఈరోజు ఎపిసోడ్‌లో బంగారం వేసుకునే స్థోమత నాకు లేదు మామయ్య అని మీనా అంటుంది. మా నాన్న ఈలోకంలో లేడు ఆయన గురించి మాట్లాడితే అత్త అయితే ఏంటి ఎవరైతే ఏంటి నేను ఇలానే శివంగిలా మాట్లాడుతాను అంటుంది. నేను ఈ పసుపు తాడుతోనే ఉంటాను అంటుంది. ఆ మాటలకు సత్యం ప్రభావతికి తిడతాడు. ప్రభావతి మాత్రం అవన్నీ మేమే చేయించాము అన్నాను కానీ నేను తీసి ఇమ్మని చెప్పనా కానీ ఇది కావాలని నన్ను చెడ్డ చేయాలని చూస్తుంది ఆ పాపం నాకు ఎందుకు వేసుకోమని చెప్పినా వినకుండా నా ఒంటి మీద కొంచెం బంగారం ఉన్నా అది నా భర్త చేయిందయితేనే వేసుకుంటాను లేదంటే వేసుకోను అని బంగారం ఇచ్చేసి వెళ్లిపోతుంది.
తర్వాత మీనా ఏడుస్తూ ఉంటే బాలు వచ్చి పేపర్ ఇచ్చి ఇందులో రాయి నీకు ఏమి కావాలో ఎంత కావాలో రాయి కొంటాను అంటాడు. నువ్వు మా అమ్మ ముందు మా ఆయన సమర్థుడు కొంటాడు అన్నావు గా కొంటాను రాయి అంటాడు. అంత బంగారం మీరు కొనలేరు అని అంటుంది మీనా. మీరు కుడా శుపథాలు చేస్తారా అంటుంది. మీరు ఎప్పుడు కొన్నా పర్లేదు కానీ నాకు ముందు పుస్తెలు తాడు కావాలి అంటుంది. వాళ్లందరి కంటే మంచివి చేయిస్తాను వాళ్ల ముందు నువ్వే బాగుండాలి అంటాడు. వాళ్లందరూ కుళ్లు కోవాలి అంటాడు.
ఆతర్వాత కామాక్షి ఇంటికి ప్రభావతి వెళ్లి బెడ్ మీద పడుకుని కాఫీ తాగుతూ నా మూడో కోడలు శృతి ఇంటికి వచ్చాక మాకు మంచం లేదు. వాళ్లు మా మంచం తీసుకున్నారు చాలా రోజులు అయింది మంచం మీద పడుకుని అంటుంది. శృతి వల్ల కాదు ఆ మీనా వల్ల వచ్చింది నాకు ఈ తిప్పలు. కామాక్షికి మీనాతో ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్తుంది. మీనా మెడలో తాడు కుడా తీసి ఇచ్చేంసింది అని చెప్తుంది. దానికి కామాక్షి మీనా మనసు ఎంత బాధపడి ఉంటే అలా చేస్తుంది అని అంటుంది కామాక్షి. ఇంట్లో ఆ బాలు, మీనా వల్ల రోజూ గొడవలే వస్తున్నాయి పిచ్చేక్కుతుంది అంటుంది ప్రభావతి. వీళ్ల వల్ల శృతి వాళ్ల అమ్మ శృతి, రవిని తీసుకెళ్లిపోతుందేమో అని భయమేస్తోంది అని అంటుంది.
రవి అత్తవారింటికి వెళ్తే మొత్తం మీ నుంచి దూరం అయిపోతారు. అప్పుడు రోహిణి కుడా మనోజ్‌ని మలేషియా తీసుకెళ్లి పోతుంది జాగ్రత్తగా ఉండు అంటుంది అప్పుడు ప్రభావతి అందుకే ఆ బాలు మీనాని ఇంట్లో నుంచి పంపించేయాలని నిర్ణయం తీసుకున్నాను అంటుంది ఆ మాటలకు కామాక్షి షాక్ అవుతూ ఏంటి ఇంట్లో నుంచి పంపించేస్తావా అంటుంది. వాళ్లని ఎలా అయినా ఇంట్లో నుంచి గెంటేస్తాను అని ప్లాన్‌లు వేస్తుంది.
తర్వాత మీనా వంట చేస్తుంటే ప్రభావతి వచ్చి కరెంట్ పోయింది శృతి కోసం వేడి నీళ్లు పెట్టమంటుంది. తర్వాత శృతి నీళ్లు తీసుకెళ్తుంటే ప్రభావతి వచ్చి ఆగు నువ్వు ఎలా తీసుకెళ్తావు అని మీనాని తీసుకెళ్లమని ఆర్డర్ వేస్తుంది. ఇదంతా బాలు చూస్తూ మండిపడుతూ ఉంటాడు. ప్రభావతి వరుసగా ఇంట్లో అందరికీ నీళ్లు పెట్టు అని అరుస్తుంటే మీనా నేను పెట్టను ఎవరి భర్తకు వాళ్ల బార్యను పెట్టమని చెప్పండి అంటుంది మీనా.. నేను చెప్తున్నా కదా వెళ్లి పెట్టు అంటే బాలు సహించలేక ఎందుకు పెట్టాలి అని అంటాడు బాలు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.