Wednesday, April 2, 2025
Homeచిత్ర ప్రభPradeep Machiraju: నవ్వులు పూయిస్తున్న ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ట్రైలర్‌

Pradeep Machiraju: నవ్వులు పూయిస్తున్న ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ట్రైలర్‌

యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju) ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’తో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో సందడి చేయనున్నాడు. జబర్దస్త్ కామెడీ షోతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్స్ నితిన్‌, భరత్‌ల ద‌ర్శ‌క‌త్వంలో, మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై ఈ సినిమా తెర‌కెక్కింది. రథన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్(Akkada Ammayi Ikkada Abbayi Movie Trailer) విడుదల చేశారు మేకర్స్.

- Advertisement -

ఒకే ఒక్క అమ్మాయి ఉన్న గ్రామానికి ప్రాజెక్టు పనిపై వెళ్లిన హీరోకి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అన్న కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఆద్యంత నవ్వులు పూయించేలా ఉన్న ఈ మూవీ ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఇక ప్రదీప్‌కు జోడీగా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీపిక పిల్లి నటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News