LIK OTT: లవ్ టుడే చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు పొందాడు ప్రదీప్ రంగనాథన. ఈ చిత్రంతో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన డ్యూడ్, డ్రాగన్ సినిమాలు మంచి విజయం సాధించాయి. బ్యాక్ టూ బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ ఫుల్ జోష్ లో ఉన్న ప్రదీప్ ఇటీవల ఎల్ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తమిళ్, తెలుగులో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజై బాక్సాఫీసు వద్ద డిసెంట్ టాక్ తెచ్చుకుంది.
తమిళంలో మంచి విజయాం సాధించింది. తెలుగులో పర్వలేదు అనిపించింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలో సందడి చేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. మే 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు.
when it’s old school vs modern rules, of course there’s a high premium 👀#LoveInsuranceKompanyOnPrime, May 6@Pradeeponelife @IamKrithiShetty #Nayanthara #VigneshShivan@iam_SJSuryah @Gourayy @dop_ravivarman @muthurajthangvl @PradeepERagav @Rowdy_Pictures @7screenstudio… pic.twitter.com/VXMCEY0EEV
— prime video IN (@PrimeVideoIN) May 1, 2026

