లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహరా(Prasad Behara) అరెస్ట్ అయ్యాడు. బెహరాతో కలిసి వెబ్ సిరీస్‌లో కలిసి నటించిన ఓ బాధితురాలు అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సందర్భంగా తన ప్రైవేట్ పార్ట్స్ తాకి లైంగింకంగా ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
- Advertisement -
కాగా ‘పెళ్లివారమండీ’, ‘మావిడాకులు’ వెబ్ సిరీస్‌లతో పేరు తెచ్చుకున్న ప్రసాద్.. ఇటీవల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేశ్ హీరోగా నటించిన ‘బచ్చలమల్లి’ చిత్రంలోనూ నటించాడు.