Prabhas: రెబెల్‌స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో తెరకెక్కుతోన్న స్పిరిట్ మూవీని అనౌన్స్‌చేసి మూడేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా మాత్రం సెట్స్‌పైకి మాత్రం వెళ్లలేదు. స్పిరిట్ అనౌన్స్‌మెంట్ తర్వాత మొదలైన రాజాసాబ్ (raja saab) రిలీజ్‌కు రెడీ కాగా…ఫౌజీ సగం కంప్లీట్ అయ్యింది. స్పిరిట్ షూటింగ్ విషయంలో ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ డిసపాయింట్ అవుతోన్నారు. ఈ క్రమంలో తాజాగా స్పిరిట్ షూటింగ్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్పిరిట్‌ను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేసినట్లు సమాచారం.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కూడా స్పిరిట్ మూవీ కోసం డేట్స్ కేటాయించినట్లు చెబుతోన్నారు. స్పిరిట్ మేజర్ పోర్షన్స్ మొత్తం మెక్సికోలో షూట్ చేయబోతున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు తెలుగుతో పాటు ఇండియన్ సినిమాల్లో కనిపించని సరికొత్త లోకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. నెవ్వర్ బిఫోర్ అనేలా ఈ సీన్స్, లొకేషన్స్ ఉంటాయని చెబుతోన్నారు. ఇప్పటికే స్పిరిట్‌కు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయ్యాయట. అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. స్పిరిట్‌లోని సాంగ్స్, బీజీఎమ్ కూడా రెగ్యులర్ తెలుగు సినిమాలకు భిన్నంగా వెస్ట్రన్ స్టైల్‌లో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని అంటున్నారు.
స్పిరిట్ మూవీలో ప్రభాస్‌కు జోడీగా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే హీరోయిన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశాడు సందీప్ వంగా… తొలుత ఈ మూవీలో దీపికా పదుకోణ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగా అనుకున్నారట. ప్రీ ప్రొడక్షన్‌లోనే సందీప్‌కు, దీపికాకు మధ్య అభిప్రాయభేదాలు మొదలయ్యాయి. దీపికా తీరు నచ్చక ఆమెను స్పిరిట్ నుంచి సందీప్ వంగానే తప్పించాడని కొందరు చెబుతోండగా….సందీప్ కండీషన్లు భయపడి దీపికానే ఈ సినిమా నుంచి వైదొలిగిందని మరికొందరు నెటిజన్లు అంటున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/nithiin-latest-movie-thammudu-day-1-collections/
ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో డార్లింగ్ కనిపించబోతున్నాడనే వార్తలు అభిమానులకు సరికొత్త ఎనర్జీనిస్తోంది. ఇప్పటి వరకు ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించలేదు. మామూలుగానే హీరో క్యారెక్టర్‌ను పవర్‌పుల్‌గా చూపించే సందీప్ వంగా.. పోలీస్ ఆఫీసర్ రోల్‌లో ప్రభాస్‌ను ఎలా చూపించబోతాడనేది అందరిలో క్యూరియాసిటీ కలుగుతోంది. మరి స్పిరిట్ మూవీతో ప్రభాస్ అభిమానుల అంచనాలను అందుకుంటాడా? బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచనాలను క్రియేట్ చేస్తాడా? అనేది తెలియాలంటే మాత్రం వెయిటింగ్ తప్పదు..