Thursday, July 10, 2025
Homeచిత్ర ప్రభSSMB 29: మ‌హేష్ కోసం ప్రియాంక చోప్రా స్పెష‌ల్ డాన్స్‌ ట్రైనింగ్‌

SSMB 29: మ‌హేష్ కోసం ప్రియాంక చోప్రా స్పెష‌ల్ డాన్స్‌ ట్రైనింగ్‌

Mahesh And Rajamouli: సర్కారు పాట, గుంటూరు కారం లాంటి సినిమాలు సూపర్ స్టార్ మహేశ్ బాబుకి అంత భారీ కమర్షియల్ సక్సెస్‌లను ఇవ్వలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ ఇప్పటికి మూడు సినిమాలు చేస్తే, ఆ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించలేకపోయాయి. కానీ, ఈ సినిమాలు స్మాల్ స్క్రీన్ మీద మాత్రం మంచి టీఆర్పీ రేటింగ్‌ను రాబట్టాయి. అతడు, ఖలేజా సినిమాలలో చేయని మ్యాజిక్ గుంటూరు కారం సినిమాలో చేస్తారనుకుంటే, ఆ రెండిటికంటే ఇంకాస్త నెగిటివ్ టాక్ నే తెచ్చుకుంది.

- Advertisement -

అయితే, పర్ఫార్మెన్స్ పరంగా మహేశ్ కి ప్రశంసలే దక్కాయి. గురూజీనే మూడుసార్లు మహేశ్ ఛాన్స్ ఇస్తే ఉపయోగించుకోలేదనే కామెంట్స్ వినిపించాయి. ఇక ప్రస్తుతం మన దేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలోనూ ఉన్న మహేశ్, రాజమౌళి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా మహేశ్ 29. ఈ సినిమా షూటింగ్ మొదలై శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్, ఒడిషాలలో కీలక షెడ్యూల్స్‌ని పూర్తి చేసిన రాజమౌళి, ఇప్పుడు ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో 50 కోట్ల భారీ ఖర్చుతో అన్‌బిలీవబుల్ సెట్‌ని నిర్మిస్తున్నారట.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/vishnu-manchu-pan-india-movie-kannappa-day-1-collections/

ఇందులో ఇంట్రవెల్ కి ముందు వచ్చే కీలక ఎపిసోడ్ ని చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇక దీని తర్వాత కెన్యాలో మరో లాంగ్ షెడ్యూల్‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజా సమాచారం మేరకు మహేశ్ 29 కోసం ప్రియాంక మయూర్ భంజ్ ఛౌ అనే నృత్యాన్ని నేర్చుకున్నారట. సినిమాలో ఈ సీన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. హిందీలో షారుఖ్ ఖాన్ నటించిన డాన్ సినిమా కోసం కత్తి యుద్ధం, కరాటే వంటి విద్యలు నేర్చుకున్నారు. ఇప్పుడు ఎస్‌సె్ఎంబి కోసం ఈ డాన్స్ నేర్చుకున్నారట.

ఇక పాన్ వరల్డ్ రేంజ్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా మహేశ్-రాజమౌళి సినిమా రూపొందుతోంది. ఇప్పటి వరకూ ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వకుండా రాజమౌళి ఎంతో పకడ్బందీగా షూటింగ్ జరుపుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమాని దుర్గ ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. మహేశ్ కూడా ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ళు డేట్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు రాజమౌళి తీసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్ళు రాబట్టినదే. ఈ సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాల అన్నీ రికార్డ్స్‌ను బ్రేక్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News