Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభPriyanka Chopra: చిలుకూరు బాలాజీని సందర్శించుకున్న ప్రియాంక చోప్రా

Priyanka Chopra: చిలుకూరు బాలాజీని సందర్శించుకున్న ప్రియాంక చోప్రా

హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నగరంలో ఉంటున్న ఆమె తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్టు క్యాప్షన్ ఇచ్చారు.

- Advertisement -

కాగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు(Mahesh babu) హీరోగా రాజమౌళి(Rajamouli) కలయికలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ మూవీలో ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికయ్యారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్టు చర్చల కోసమే ఆమె హైదరాబాద్‌ వచ్చారంటూ నెట్టింట తీవ్ర చర్చ జరిగింది. తాజాగా బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం అంటూ ఆమె ప్రకటించడంతో ఈ సినిమాలో ప్రియాంక నటించడం ఖాయమంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad