Posani Krishna Murali| ఇకపై రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి ప్రకటించిన సంగతి తెలిసిందే. తన కుటుంబం కోసమే రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించానని.. తనకు ఏ రాజకీయా పార్టీతో సంబంధం లేదని ఆయన తెలిపారు. పోసాని వ్యాఖ్యలపై నిర్మాత, జనసేన మద్దతుదారు ఎస్‌కేఎన్(SKN) తనదైన శైలిలో స్పందించారు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కుటుంబంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమించండని అడిగి ఉండే పోసాని మాటలు నమ్మాలి అనిపించేది అని పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
‘‘సార్.. ఇప్పుడు అందరికీ అన్నీ గుర్తొస్తాయి. కానీ విరమిస్తున్నా అంటూ మీరు డ్రామా చేసే ముందు.. కనీసం మా అభిమాన నాయకుడి గురించి, ముఖ్యంగా వారింట్లో పిల్లల గురించి మీరు మాట్లాడిన సంస్కారం లేని వ్యాఖ్యలపై స్పందించి ఉంటే బాగుండేది. ‘ఆ వ్యాఖ్యలకు చింతిస్తున్నా.. క్షమించండి’ అని అడిగి ఉంటే మీ మాటలు నమ్మాలనిపించేది. మీరు ఏదో ఒకసారి పొరపాటుగా మాట్లాడిన వ్యక్తి కాదు. ఎన్నోసార్లు ఎంతో నీచంగా మాట్లాడారు. అభిమానుల మనసును ఎంతో బాధపెట్టారు. మీది మాత్రమే కాదు అందరివీ కుటుంబాలే. రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ వ్యక్తిగతంగా దిగజారుడు మాటలు మాట్లాడి.. కుటుంబాల మీద కామెంట్స్ చేసిన వారు మాత్రం క్షమార్హులు కారు’’ అని అందులో రాసుకొచ్చారు.