Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభVijay Kirangadur : జనవరికి 'సలార్' షూట్ పూర్తవుతుంది.. సీక్వెల్ కూడా ప్లాన్‌లో ఉంది..

Vijay Kirangadur : జనవరికి ‘సలార్’ షూట్ పూర్తవుతుంది.. సీక్వెల్ కూడా ప్లాన్‌లో ఉంది..

- Advertisement -

Vijay Kirangadur : ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాల్లో సలార్ ఒకటి. రాధేశ్యామ్ అభిమానులని నిరాశపరచడంతో ఈ సినిమాపైనే ప్రభాస్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. KGF తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అదే KGF నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. తాజాగా సలార్ సినిమా నిర్మాత విజయ్ కిరంగదుర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు.

నిర్మాత విజయ్ మాట్లాడుతూ.. మా బ్యానర్ నుంచి రాబోతున్న భారీ సినిమా సలార్. ఇప్పటికే 85 శాతం చిత్రీకరణ పూర్తయింది. జనవరి చివరికి మిగిలిన షూట్ కూడా పూర్తవుతుంది. VFX వర్క్స్ కోసం మరో ఆరునెలలు పడుతుంది. ముందుగా అనౌన్స్ చేసినట్టే 2023 సెప్టెంబర్ 28న సినిమాని రిలీజ్ చేస్తాం. ఇటీవల సినిమా రష్ కూడా చూశాను. చాలా బాగా వచ్చింది. పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది ఈ సినిమా. సలార్ కి సీక్వెల్ కూడా అనుకుంటున్నాం. కాకపోతే అది సినిమా రిలీజ్ అయ్యాక దానిపై నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు.

దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. సలార్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News