ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కలయికలో డిసెంబర్ 5న విడుదలైన ‘పుష్ప2′(Pushpa 2) చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తొలి షో నుంచే బ్లాక్‌బాస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. అత్యంత వేగవంతంగా రూ.1000కోట్లు కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. అంతేకాదు హిందీ బెల్ట్‌లోనూ ఎవరు ఊహించలేని విధంగా కలెక్షన్స్ రాబడుతోంది.
హిందీలో ఈ మూవీ మొదటి రోజు రూ.72 కోట్ల కలెక్షన్లు వసూలు చేయగా..రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజు రూ.74 కోట్లు, నాలుగో రోజు రూ. 86 కోట్లు, ఐదో రోజు రూ. 48 కోట్లు, ఆరో రోజు రూ.36 కోట్లు వసూలు చేసింది. ఇలా కేవలం హిందీలోనే ఆరు రోజుల్లో రూ.375 కోట్లు రాబట్టి తొలి భారతీయ చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఇదే దూకుడు కొనసాగిస్తే ప్రపంచవ్యాప్తంగా రూ.1500కోట్లు, ఒక్క హిందీలోనే రూ.700 కోట్లు రాబటొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.