Friday, January 23, 2026
Homeచిత్ర ప్రభPushpa 2 Japan Release: జపాన్‌లో పుష్పగాడు రూల్.. ‘పుష్ప కున్రిన్’తో పుష్పరాజ్ హవా స్టార్ట్!”

Pushpa 2 Japan Release: జపాన్‌లో పుష్పగాడు రూల్.. ‘పుష్ప కున్రిన్’తో పుష్పరాజ్ హవా స్టార్ట్!”

Pushpa 2 Japan Release: ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన అద్భుత విజయం తర్వాత, జపాన్ మార్కెట్ ఇప్పుడు టాలీవుడ్‌కు ఒక కొత్త ఫేవరెట్ డెస్టినేషన్గా మారింది. ఆ గ్లోబల్ హిట్ స్ఫూర్తితో, ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’ లాంటి సినిమాలు అక్కడ సందడి చేసిన తర్వాత, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సెన్సేషనల్ సీక్వెల్ ‘పుష్ప 2 ది రూల్’ గ్రాండ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ‘పుష్ప కున్రిన్’ అనే టైటిల్‌తో ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 16న జపాన్‌లో థియేటర్లలోకి రానుంది.

- Advertisement -

ALSO READ: Akhanda 2: ‘అఖండ 2’కి ఏపీలో టికెట్ హైక్.. మాస్ తాండవం స్టార్ట్!

మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ జపాన్‌లో విడుదల కాకపోయినా, రెండో పార్ట్‌కు ఇంత భారీ ప్లానింగ్ జరుగుతోంది. మరి పుష్పరాజ్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. అంతేకాకుండా, ‘పుష్ప 2’ కథలో జపాన్ నేపథ్యం కూడా కీలకంగా ఉండటం అక్కడి ప్రేక్షకులను మరింతగా కనెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా, యోకోహామా పోర్ట్‌లో హీరోకి సంబంధించిన కీలక సన్నివేశాలతో కథ మొదలవ్వడం, జపాన్ ప్రేక్షకులకు కథలోకి మరింత త్వరగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.

భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన ‘పుష్ప 2’ సుమారు ₹1800 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్టు అంచనా. ఇప్పుడు జపాన్ మార్కెట్‌లోకి కూడా అడుగుపెట్టడంతో, ఈ కలెక్షన్ల ఫిగర్ ఇంకా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయం. ‘ఆర్ఆర్ఆర్’ జపాన్‌లో 2.42 బిలియన్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఆ స్థాయిలో కాకపోయినా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ మంచి వసూళ్లు సాధిస్తే, అల్లు అర్జున్ ఇమేజ్ అక్కడ మరింత బలంగా స్థిరపడుతుంది. రష్మిక మందన్నా కూడా ఈ రిలీజ్‌ను ప్రమోట్ చేయడంతో, జపాన్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు.

ALSO READ: Stranger Things 5: ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ న్యూ రికార్డు.. 5 రోజుల్లో 59.6 మిలియన్ వ్యూస్‌!

ఒకప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన మన సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి మరింత బలం చేకూరుస్తూ, డైరెక్టర్ సుకుమార్ ఆల్రెడీ ‘పుష్ప 2’ క్లైమాక్స్ లో ‘పుష్ప 3’ కూడా ఉండబోతుందని హింట్ ఇచ్చేసారు. ఈ మూడో భాగం వచ్చే ఏడాది ఎండింగ్‌లో ఉండబోతుంది. ప్రస్తుతం మన పుష్పరాజ్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ సినిమాలో ఫుల్‌గా బిజీగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News