Fahadh Faasil: మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు పొందిన ఆయన పుష్ప చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో ఆయన నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భన్వర్ సింగ్ షెకవత్ గా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. పుష్పతో తెలుగులో ఆయన మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో తెలుగులోనూ ఆయనకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
పుష్ఫతో ఫుల్ క్రేజ్
టాలీవుడ్ బడా నిర్మాతలంత ఫహద్ కోసం క్యూ కడుతున్నారు. కానీ, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట. దీనికి కారణం రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. దీంతో మేకర్స్ వెనక్కి తగ్గుతున్నారట. పుష్ప తర్వాత ఫహద్ ఫాజిల్ ఇక తెలుగులో ఆఫర్స్ భారీగా వస్తున్నాయి. ఆ క్రేజ్ చూసి టాలీవుడ్ లో ఆయన ఫుల్ బిజీ అయిపోతారునుకున్నారు. కానీ, పుష్ప తర్వాత ఆయన ఇప్పటి వరకు పెద్ద సినిమాలు సంతకం చేసింది లేదు. ప్రస్తుతం తెలుగులో డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్’ మినహా..తెలుగులో ఇంకో చిత్రమేది చేయడం లేదు.
రూ. 20 కోట్లు డిమాండ్
తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించడానికి భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. హీరోగా కాకుండా విలన్‌గా నటించాలంటే రూ. 15 కోట్లు నుంచి రూ. 20 కోట్లు వరకు ఇవ్వాలని కండీషన్ పెడుతున్నారట. దీంతో మేకర్స్ అంత మొత్తం ఇచ్చుకోలేక వెనక్కి తగ్గుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఫహద్‌కు టాలీవుడ్‌లో అవకాశాలు రావడం లేదట. నిజానికి అనిల్ రావిపూడి, వెంకటేష్ ల మల్టీస్టారర్ చిత్రంలో ఫహద్ ని కూడా అనుకున్నారట. కానీ, పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేయడంతో ఆయన స్థానంలో కల్యాణ్ రామ్‌ని తీసుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుస. అలాగే రామ్ సినిమాలోనూ విలన్‌గా ఫహద్‌నే తీసుకోవాలనుకున్నారట.
అక్కడ కూడా పారితోషికం విషయంలోనే ఇబ్బందులు ఎదురై చివరకు వదిలేశారట. ఫహద్‌ని తీసుకుంటే మలయాళంతో పాటు పాన్ ఇండియా మార్కెట్‌కి కూడా ప్లస్ అవుతుందని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారు. అయితే భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో.. అంత ఇచ్చుకోలేక ఇతర నటులవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పాటు ఫహద్ కూడా రొటీన్ విలన్ పాత్రలు చేయడానికి ఇష్టపడడం లేదట. తనకు గుర్తింపు తెచ్చేలా ఉంటేనే ఆ పాత్రలో నటించేందుకు ముందుకు వస్తున్నాడట. లేదంటే హీరోగా సినిమాలు చేసుకుందామనే ఆలోచనలోనే ఉన్నారట. విలన్ కంటే హీరో పాత్రలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Rishab Shetty: హీరోయిన్ ని అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి.. అసలేం జరుగుతుంది

