Wednesday, January 8, 2025
Homeచిత్ర ప్రభPushpa2: 'బాహుబలి2' రికార్డును బ్రేక్ చేసిన 'పుష్ప2'

Pushpa2: ‘బాహుబలి2’ రికార్డును బ్రేక్ చేసిన ‘పుష్ప2’

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప 2’(Pushpa 2) చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన రోజు నుంచి వసూళ్ల సునామీ సృష్టిస్తోన్న ఈ మూవీ ఇప్పటికే రూ.1500కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. తాజాగా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అలాగే తెలుగు సినిమాల్లో ప్రథమ స్థానం దక్కించుకుంది. 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు రెండో స్థానంలో ‘బాహుబలి2′(రూ.1810కోట్లు) రికార్డును బ్రేక్ చేసింది. ఇక అమిర్ ఖాన్ ‘దంగల్’ (రూ. 2వేల కోట్లకుపైగా) తొలి స్థానంలో ఉంది.

- Advertisement -

అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాలో ‘దంగల్‌’, ‘పుష్ప 2’, ‘బాహుబలి 2’ తొలి మూడు స్థానాల్లో నిలవగా.. RRR(రూ.1387+ కోట్లు), KGF‌ 2 (రూ.1250+ కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.1153+ కోట్లు), జవాన్‌ (రూ.1148+ కోట్లు), పఠాన్‌ (రూ.1050+ కోట్లు) ఉన్నాయి. వీటిలో నాలుగు తెలుగు చిత్రాలే ఉండటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News