Friday, January 17, 2025
Homeచిత్ర ప్రభPushpa 2: 'పుష్ప2' రీలోడెడ్ వెర్షన్‌లో అదిరిపోయిన సీన్స్.. బన్నీ ఆసక్తికర ట్వీట్

Pushpa 2: ‘పుష్ప2’ రీలోడెడ్ వెర్షన్‌లో అదిరిపోయిన సీన్స్.. బన్నీ ఆసక్తికర ట్వీట్

అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్‌ మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నారు. నెలన్నర క్రితం విడుడలైన ‘పుష్ప-2′(Pushpa2) చిత్రం బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. రూ.1850కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. తాజాగా మరో 20 నిమిషాల సీన్స్‌ను యాడ్ చేసి రీలోడెడ్ వెర్షన్ ఈరోజు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సీన్స్ చూసిన ప్రేక్షకులు అదిరిపోయాయని చెబుతున్నారు. ముఖ్యంగా బన్నీ ఇంట్రడక్షన్‌లో చేసిన జపాన్ ఫైట్‌కు సెకండ్ హాఫ్‌లో పెట్టిన లింక్ అదిరిపోయిందంటున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా బన్నీ ట్వీట్ చేశారు. “పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ ఈ రోజు నుంచి అందిస్తున్నాం. అదనపు ఫుటేజితో కూడిన ‘పుష్ప-2’ చిత్రంతో మీరందరూ సరికొత్త అనుభూతి పొందుతారని భావిస్తున్నాను” అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా వాస్తవానికి ఈ రీలోడెడ్ వెర్షన్ జనవరి 11 నుంచే ప్రదర్శిస్తారని చిత్రబృందం ఇంతకుముందు ప్రకటించింది. అయితే అనివార్య కారణాలతో ఆ నిర్ణయం వాయిదా పడింది. తాజాగా యాడ్ చేసిన సీన్స్‌తో మూవీ నిడివి 3 గంటల 20 నిమిషాలుగా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News