Mohan Babu: మంచు కుటుంబం వివాదంపై రాచకొండ సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. మంచు మనోజ్ (Manchu Manoj), మోహన్ బాబుపై మొత్తం మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని తెలిపారు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎలాంటి ఆలస్యం లేదన్నారు. ఆయన దగ్గర నుంచి మెడికల్ రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. విచారణకు ఈనెల 24 వరకు సమయం అడిగారని పేర్కొన్నారు. అయితే ఆ లోపే కేసు విచారణకు కోర్టును అభ్యర్థిస్తామని చెప్పారు.
ఇప్పటికే మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశామన్నారు. మరోసారి నోటీసులు ఇస్తామని.. స్పందించని పక్షంలో అరెస్ట్ చేస్తామని సీపీ స్పష్టం చేశారు. ఇక రాచకొండ పరిధిలో మోహన్‌బాబుకు గన్ లైసెన్స్ లేదన్నారు. ఆయన వద్ద ఒక డబుల్ బ్యారెల్, స్పానిష్ మేడ్ రివాల్వర్ ఉందన్నారు. వాటిని డిపాజిట్ చేయమని ఆదేశాలు ఇవ్వడంతో చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేశారని వెల్లడించారు.