సినీ ఇండస్ట్రీలో ఢిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన చిత్రం ‘రాచరికం’. విజయ్ శంకర్ హీరోగా వరుణ్ సందేశ్ విలన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో మూవీ రివ్యూలో చూద్దాం.
మూవీ రివ్యూ: రాచరికం (Racharikam)
విజయ్ శంకర్ హీరోగా వరుణ్ సందేశ్ విలన్ గా అప్సరా రాణి లీడ్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో వహించారు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈశ్వర్ నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఈ మధ్యకాలంలో 1980 నేపథ్యంలో పలు చిత్రాలను తెరకెక్కుతున్నాయి. రంగస్థలం నుంచి ఈ తరహా కథలు తెలుగులో ఎక్కువగా వస్తున్నాయి. అప్పటి కాలం అంటే ఫోన్ లు, నెట్ సహా ఇతర సాంకేతిక అంశాలకు దూరంగా సినిమాలను తెరకెక్కించవచ్చు. ఇపుడు మన దర్శక, నిర్మాతలు అలాంటి తరహా గ్రామీణ నేపథ్యంలో ఉన్న రాజకీయాలను తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ తరహా చిత్రాలకు అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనలను ప్రేరణ తీసుకొని తెరకెక్కిస్తున్నారు. ఇపుడు దర్శకుడు సురేశ్ లంకలపల్లి అదే తరహా కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరపై ఆవిష్కరించాడు. గ్రామీణ నేపథ్యంలో రాజకీయాల్లో రాణించాలనుకునే అన్నాచెల్లెలు, మధ్యలో చెల్లి, మరో పార్టీ నాయకుడికి మధ్య లవ్ ఎఫైర్,ఇది తెలిసి హీరోయిన్ కుటుంబ సభ్యులకు కంటగింపుగా ఉండటం. ఆ నేపథ్యంలో హీరోపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడటం వంటివి రొటిన్ గా ఉన్నా.. ప్రేక్షకులకు కన్విన్సింగ్ చెప్పే ప్రయత్నం చేసాడు. అప్పటి తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ మధ్య రొమాన్స్ తో పాటు యాక్షన్ సీన్స్, భావోవద్వేగాలు బాగానే పండాయి. నిర్మాణ విలువులు బాగున్నాయి. బీజీఎం పర్వాలేదు.
నటీనటుల విషయానికొస్తే..
హీరో విజయ్ శంకర్ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇక వరుణ్ సందేశ్ ప్రతినాయకుడిగా పాత్రలో చూడటం కొత్త అయినా.. అందులో ఇరగదీసాడు. శ్రీకాంత్ అయ్యంగార్ ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే. అప్పరా రాణి ఈ సినిమాలో టెర్రిఫిక్ నటన కనబరించింది. రొమాన్స్ సన్నివేశాల్లో అద్భుతంగా ఒదిగిపోయింది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
తారాగణం: విజయ్ శంకర్, వరుణ్ సందేశ్, అప్సరా రాణి, ఈశ్వర్ వసె, జబర్ధస్త్ మహేష్, హైపర్ ఆది తదితరులు
సంగీతం: వెంగీ
సినిమాటోగ్రఫీ: ఆర్య సాయి కృష్ణ
ఎడిటర్: జానకి రామ్
బ్యానర్: చిల్ బ్రాస్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత: ఈశ్వర్ వసే
దర్శకత్వం: సురేశ్ లంకలపల్లి
పంచ్ లైన్: ‘రాచరికం’ ఆకట్టుకునే విలేజ్ పొలిటికల్ డ్రామా
రేటింగ్: 3/5