Friday, December 12, 2025
Homeచిత్ర ప్రభPaanch Minar OTT: రాజ్ తరుణ్ పాంచ్ మినార్.. వారం రోజుల్లోనే ఓటీటీలో!

Paanch Minar OTT: రాజ్ తరుణ్ పాంచ్ మినార్.. వారం రోజుల్లోనే ఓటీటీలో!

Paanch Minar OTT: యూట్యూబ్‌లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ కెరీర్ స్టార్ట్ చేసిన రాజ్ తరుణ్, ‘ఉయ్యాలా జంపాలా’ లాంటి సింపుల్ స్టోరీ లైన్‌తో అదిరిపోయే హిట్ కొట్టి, టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21 ఎఫ్’ లాంటి సినిమాలు తనుకి యూత్‌లో ఊహించని క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఆ జోష్ కొంతకాలం కొనసాగినా, ఆ తర్వాత తను చేసిన సినిమాలు కొన్ని ‘పర్లేదు’ అనిపించినా, మరికొన్ని మాత్రం ఆడియన్స్‌ను చాలా డిసప్పాయింట్ చేశాయి. ఈ మధ్యకాలంలో పర్సనల్ లైఫ్‌లోనూ తను చాలా ఇబ్బందులే ఫేస్ చేశాడు రాజ్ తరుణ్. మొత్తానికి తను కోరుకున్న ఆ కం బ్యాక్ హిట్ ఒకటి తన ఖాతాలో వచ్చింది అనుకునేలోపు, ఆ సినిమా విషయంలో పెద్ద ట్విస్ట్ ఎదురైంది.

- Advertisement -

ALSO READ: Ram Pothineni: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ

 రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పాంచ్ మినార్’ నవంబర్ 21, రిలీజ్ అయిన ఆడియన్స్ లో మంచి టాక్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న, రిలీజ్ అయిన వారం రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌లోకి రావడం అనేది, ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఇంత త్వరగా ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఇదే అంటున్నారు. ఈ రోజుల్లో సినిమా ఎంత కొత్తగా ఉన్నా, దాన్ని జనాల్లోకి తీసుకు వెళ్లే పబ్లిసిటీ కూడా అంతే కొత్తగా ఉండాలి. లేదంటే, జనాలు థియేటర్‌కు రావడం అనేది చాలా కష్టం. ‘పాంచ్ మినార్’ విషయంలో కూడా అదే జరిగింది! సినిమా కంటెంట్ పరంగా బాగున్నా, హైప్ క్రియేట్ చేసే పబ్లిసిటీని మేకర్స్ చేయలేకపోయారు. అందుకే, సినిమా రిలీజ్ అయినట్లే జనాలకు తెలీలేదు. ‘పాంచ్ మినార్’ తన కెరీర్‌కు కం బ్యాక్ ఫిల్మ్ అయ్యే అవకాశం ఉన్నా, పబ్లిసిటీ ఫెయిల్యూర్ కారణంగా, థియేటర్లలో రెస్పాన్స్ దక్కలేదు.

ఒక సినిమా ఇంత తక్కువ టైమ్‌లో ఇంట్లో కూర్చుని చూసే అవకాశం వస్తే, 200-300 రూపాయలు ఖర్చు చేసి ఫ్యామిలీతో థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరం ఏముంది? అనే మైండ్‌సెట్ జనాల్లో ఫిక్స్ అయిపోయింది. సినిమా డిజాస్టర్ అయినప్పుడు నిర్మాతలు ఇలాంటి డీల్స్ చేసుకున్న ఒక అర్థం ఉంటుంది. కానీ కంటెంట్ బాగున్నా సినిమాలకి కూడా ఇలా చేస్తే, ఇక థియేటర్స్ కి జనం రావడం అనేది చాలా కష్టంగా మారుతుంది. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే, తన లాంటి యంగ్ హీరోల సినిమాలకు థియేటర్లలో ఫ్యూచర్ లేకుండా పోతుంది.

ALSO READ: Singer mangli: మేడిపల్లి స్టార్ పై సింగర్ మంగ్లీ ఫిర్యాదు.. దెబ్బతో కటకటాల్లోకి!

ఒక్క ముక్కలో చెప్పాలంటే, ‘పాంచ్ మినార్’ లాంటి సినిమా వారం రోజుల్లో ఓటీటీకి రావడం అనేది, కేవలం ఫ్లాప్ ఎఫెక్ట్ మాత్రమే కాదు, సినిమా బిజినెస్‌లో రూల్స్ మారాయి అనడానికి పక్కా ఎగ్జాంపుల్. ఇప్పుడు నిర్మాతలు తమ పెట్టుబడిని రిస్క్‌లో పెట్టకుండా, ఓటీటీ డీల్‌పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. థియేటర్లలో ఆడకపోతే, వెంటనే తమ సినిమాను ఓటీటీకి ఇచ్చేస్తే, త్వరగా లాభం వస్తుంది. అందుకే, పెద్ద సినిమాలు తప్ప, చిన్న సినిమాలకు థియేటర్లలో సర్వైవల్ అనేది చాలా కష్టం. ఈ ట్రెండ్‌ను కంట్రోల్ చేయకపోతే, ఫ్యూచర్‌లో థియేటర్లు అన్నీ కల్యాణ మండపాలుగా మారిపోతాయి మన ముందే. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News