The Bhootnii: బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ మూవీ ది భూత్‌నీ ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సిద్ధాంత్ సచ్‌దేవ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మౌనీరాయ్, సన్నీసింగ్ కీలక పాత్రల్లో నటించారు. జీ5 ఓటీటీలో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజైంది. త్వరలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
థియేటర్లలో డిజాస్టర్…
మే 1న థియేటర్లలో రిలీజైన ది భూత్‌నీ డిజాస్టర్‌గా నిలిచింది. కామెడీ అంతగా వర్కవుట్ కాకపోవడం, హారర్ ఎలిమెంట్స్‌తో భయపెట్టడంలో డైరెక్టర్ విఫలమవ్వడంతో భూత్‌నీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన భూత్‌నీ పదిహేను కోట్లలోపే వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది.
Also Read – Suicide in bank: బ్యాంకులోనే ఉరేసుకొని మేనేజర్ ఆత్మహత్య. ఒత్తిడే కారణమా?
చెట్టుపై దయ్యం…
సెయింటి విన్సెంట్ కాలేజీలో ఉన్న చెట్టుపై మొహబ్బత్ అనే దయ్యం ఉంటుంది. వాలెంటైన్స్ డే రోజు నిజమైన ప్రేమికులకు మాత్రమే ఆ దయ్యం కనిపిస్తుంటుంది. వారి ప్రేమను గెలిపిస్తుందని స్టూడెంట్స్ నమ్ముతుంటారు. కాలేజీలో అనుమానస్పద రీతిలో ఓ స్టూడెంట్ చనిపోతాడు. దయ్యమే అతడిని చంపిందని అందరూ అనుకుంటారు. శంతను ఓ స్టూడెంట్. ప్రేమలో ఫెయిలవుతాడు. శంతను నిజాయితీ, మంచితనానికి మొహబ్బత్ ఫిదా అవుతుంది. శంతనుతో ప్రేమలో పడతుంది. మొహబ్బత్ కారణంగా శంతనుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మొహబ్బత్ బారి నుంచి శంతనును కాపాడిన బాబా ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
రాజాసాబ్‌లో…
ప్రభాస్ రాజాసాబ్‌లో సంజయ్‌దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తాత క్యారెక్టర్‌లో సంజయ్‌దత్ కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు డిఫరెంట్ షేడ్స్‌తో సంజయ్ దత్ పాత్ర సాగుతుందని అంటున్నారు. రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read – Rain havoc in Hyderabad: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం: పాట్నీ నాలా ఉప్పొంగి జలమయం..!యం
విశ్వంభరలో స్పెషల్ సాంగ్…
భూత్‌నీలో హీరోయిన్‌గా నటించిన మౌనీరాయ్ కూడా త్వరలోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి విశ్వంభరలో ఈ బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


