TheRajaSaab: ప్రభాస్ అభిమానుల మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాజాసాబ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. ఈ సంక్రాంతి సినిమాల్లో రాజాసాబ్ కోసమే ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూశారు. కానీ ఫస్ట్ డేనే నెగెటివ్ టాక్‌తో డిజపాయింట్ చేసింది. కలెక్షన్స్ పరంగా కూడా అంచనాలను అందుకోలేకపోయింది రాజాసాబ్. రీసెంట్ టైమ్‌లో ప్రభాస్ కెరీర్‌లో అతి తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. సలార్, కల్కి సినిమాలతో పోలిస్తే సగం కూడా ఈ హారర్ కామెడీ మూవీ కలెక్షన్స్ సాధించలేకపోయింది.
ఇండియావైడ్‌గా ఫస్ట్ డే రాజాసాబ్ మూవీ 54 కోట్ల నెట్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు వెర్షన్ 47 కోట్లు కలెక్షన్స్ తో పర్వాలేదనిపించగా… మిగిలిన భాషల్లో మాత్రం రాజాసాబ్ తేలిపోయింది. హిందీలో ఆరు కోట్ల పదిహేను లక్షలు వచ్చాయి. తమిళం, కర్ణాటక, కేరళలో ఏ మాత్రం రాజాసాబ్ ప్రభావం కనిపించలేదు. మూడు భాషల్లో కలిపి కోటి కూడా ఈ సినిమాకు వసూళ్లు రాకపోవడం గమనార్హం. నెగెటివ్ టాక్ కారణంగా రెండో రోజు వసూళ్లు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కల్కి ఫస్ట్ డే 95 కోట్లు, సలార్ 90 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాయి.
Also Read – Sankranti: సంక్రాంతి నాడు పొరపాటున కూడా ఇలా చేయోద్దు!
తెలంగాణలో ప్రీమియర్స్ షోస్ పడకపోవడం, అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యంగా ఓపెన్ కావడం వల్ల కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. వాటికి తోడు నెగెటివ్ టాక్ ఎఫెక్ట్ కూడా ఉందని అంటున్నారు.
హారర్ కామెడీగా రాజాసాబ్ మూవీని రూపొందించారు మారుతి. కాన్సెప్ట్ బాగుందనే టాక్ వచ్చిన కామెడీ, హారర్ ఎలిమెంట్స్ సరిగ్గా వర్కవుట్ కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ లుక్‌తో పాటు హీరోయిన్లతో అతడి లవ్‌ట్రాక్‌లు, పాటలు కూడా బాగా లేవంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. మారుతినే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
రాజాసాబ్ మూవీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్‌దత్, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
Also Read – Shraddha Das: శ్రద్ధా దాస్ హాట్ ట్రీట్.. ఆ చూపులకు కుర్రాళ్లు చిత్తవ్వాల్సిందే!

