Friday, April 11, 2025
Homeచిత్ర ప్రభRajadhani Rowdy ready to release: యశ్ కొత్త సినిమా రాజధాని రౌడీ రెడీ

Rajadhani Rowdy ready to release: యశ్ కొత్త సినిమా రాజధాని రౌడీ రెడీ

సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సంతోష్ కుమార్ నిర్మాణంలో, సంచలన విజయం సాధించిన కెజియఫ్ ఫేమ్ యశ్ హీరోగా, షీనా హీరోయిన్ గా, కె.వి రాజు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం” రాజధాని రౌడీ”. ఈ చిత్రం జూన్ 14న విడుదల కు సిద్ధమైంది.

- Advertisement -

ఈ సందర్భంగా నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు, మద్యపానం బారినపడి, నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కధాంశంతో తెరకెక్కిన చిత్రం “రాజధాని రౌడీ”. వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందిన చిత్రమిది. చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ, ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీస్ గా అద్భుతమైన నటన ప్రదర్శించారు.

ముమైత్ ఖాన్ తన అందాలతో కనువిందుచేస్తారు. అర్జున్ జన్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. అత్యధిక థియేటర్లలో ఈనెల 14న విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News