SSMB 29 – Mahesh Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో జక్కన్న తెరకెక్కించిన పాన్ ఇండియా వండర్ RRR ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఏకంగా ఆస్కార్ దక్కించుకుని భారతీయ సినిమా చరిత్రలో ఓ సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. అలాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత, జక్కన్న ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్‌తో కలిసి భారీ పాన్ వరల్డ్ మూవీ SSMB 29ను చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ మాధవన్ కూడా మరో కీ రోల్‌లో కనిపిస్తారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
SSMB 29కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లతో పాటు క్రేజీ VFX కంపెనీలు కూడా పని చేస్తున్నాయి. రాజమౌళి గత చిత్రాలకు భిన్నంగా, ఈ సినిమా షూటింగ్ రాకెట్ స్పీడుతో సాగుతోంది. ఇప్పటికే చాలా కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, సింధూ లోయ, వారణాసికి ఉన్న అనుబంధం నేపథ్యంలో, చారిత్రకాంశాల్ని మేళవించిన ఓ డివోషనల్ యాక్షన్ అడ్వెంచర్‌గా SSMB 29 తెరకెక్కుతోందని సమాచారం.
Also Read – Baahubali Reunion: బాహుబలి రీ యూనియన్ పార్టీ – అనుష్క, తమన్నా మిస్సింగ్ – ఫ్యాన్స్ హర్ట్!
ఈ సినిమా టైటిల్ విషయంలోనే జక్కన్నకు ఊహించని షాక్ ఎదురైనట్టు తెలుస్తోంది. కథ డిమాండ్ మేరకు రాజమౌళి ‘వారణాసి’ అనే టైటిల్‌ని అనుకున్నారట. కానీ, అదే టైటిల్‌ని ఇప్పటికే ఓ యంగ్ డైరెక్టర్ రిజిస్టర్ చేయించుకోవడమే కాకుండా.. దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా తీస్తున్నాడట. స్టోరీ డిమాండ్‌కు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలా ‘వారణాసి’ టైటిల్‌ని ఆ యంగ్ డైరెక్టర్ ఫిక్స్ చేయటమే కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని సమాచారం. ఈ విషయం తెలిసిన రాజమౌళి మూవీ టైటిల్ కోసం ఆ యంగ్ డైరెక్టర్‌ని సంప్రదించారట. ఎంత డబ్బైనా ఆఫర్ చేసి టైటిల్ దక్కించుకోవాలని ప్రయత్నించినా, సదరు యంగ్ డైరెక్టర్ మాత్రం ‘వారణాసి’ టైటిల్‌ను ఇవ్వడానికి ఖరాకండీగా అంగీకరించలేదని ఇండస్ట్రీలో ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది.
ఇంతకీ జక్కన్నకు షాక్ ఇచ్చిన ఆ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు.. సీ.హెచ్. సుబ్బారెడ్డి. గతంలో ఆది సాయికుమార్‌తో ‘రఫ్’ మూవీని తెరకెక్కించిన ఈ దర్శకుడు.. ప్రస్తుతం ఓ యంగ్ హీరోతో మెగా బడ్జెట్‌తో ఈ ‘వారణాసి’ సినిమాను తీస్తున్నాడు. జక్కన్నే స్వయంగా అడిగినా టైటిల్ దక్కకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరిప్పుడు మహేష్ సినిమాకు కొత్త టైటిల్ ఏం ఖరారు చేస్తారో చూడాలి.
Also Read – Meenaakshi Chaudhary: జీన్స్‌లో కవ్వెక్కిస్తున్న మీనాక్షి చౌదరి

